కోల్‌ గేట్‌తో సంబంధం లేదు: దాసరి

December 09, 2014 | 04:12 PM | 55 Views
ప్రింట్ కామెంట్

కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ తెలుగు సినిమా దర్శకులు దాసరి నారాయణ రావును ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారించింది. బొగ్గు కుంభకోణం కేసులో దాసరిని సోమవారం ఈడీ ప్రశ్నించింది. అనంతరం దాసరి మాట్లాడారు. బొగ్గు కుంభకోణంతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తన పైన వచ్చిన ఆరోపణలు నిరాధారమన్నారు. తాను ఎప్పుడు నిబంధనలు ఉల్లంఘించలేదన్నారు. ఈడి ప్రశ్నలకు తాను సమాధానమిచ్చానని తెలిపారు. సిరి మీడియాలో తనకు ఎలాంటి బాండ్లు లేవని చెప్పారు. తన ఆరోగ్యం బాగా లేనందున విచారణకు హాజరు కాలేదని చెప్పారు. దాసరి తొమ్మిది పేజీల వాంగ్మూలం ఇచ్చారు. దాసరిని ఈడి ఈ నెల 18న మరోసారి ప్రశ్నించనుంది. సిరి మీడియా డైరెక్టర్లను కూడా ప్రశ్నించనుంది. సీబీఐపై సుప్రీం అసంతృప్తి బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ దర్యాఫ్తు తీరును అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆక్షేపించింది. కేసు విచారణలో సీబీఐ చాలా వెనుకబడిరదని అభిప్రాయపడిరది. 2015 మార్చి 31 గడువుకు సీబీఐ కట్టుబడి ఉండాలని సుప్రీం సూచించింది. గతంలోను విచారణ సంస్థలు విచారణ కేంద్రంలో ప్రకంపనలు సృష్టించిన బొగ్గు కుంభకోణం కేసులో దర్శకరత్న, మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణ రావును ప్రశ్నించినట్లుగా విచారణ సంస్థలు గతంలోను ప్రశ్నించాయి. ఈ కుంభకోణానికి సంబంధించి దాసరి సహా మాజీ మంత్రులను పలువురిని ప్రశ్నించాయి. 2006-2009 మధ్యకాలంలో బొగ్గు శాఖలో భారీ కుంభకోణం జరిగిందని కాగ్‌ నివేదిక ద్వారా వెలుగు చూసిన విషయం తెలిసిందే. అప్పుడు దాసరి బొగ్గు శాఖ సహాయమంత్రిగా ఉన్నారు. గతంలో దాసరిని సీబీఐ హైదరాబాదులో ప్రశ్నించింది. అధే సమయంలో మరో మాజీ మంత్రి సంతోష్‌ బగ్రోడియాను కూడా ప్రశ్నించింది. హిండాల్కోకు బొగ్గు కేటాయింపుల విషయంలో తన ప్రమేయం లేదని దాసరి నారాయణ రావు సీబీఐకి ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో వెల్లడిరచినట్లుగా వార్తలు వచ్చాయి. బొగ్గు కుంభకోణంలో విచారణ జరుపుతున్న సిబిఐ ముందుకు దాసరి తనకు సహాయంగా గతంలో పిఎస్‌గా పని చేసిన అధికారిని కూడా తీసుకువెళ్లారు. స్క్రీనింగ్‌ కమిటీ తమిళనాడుకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌కు తలబిరా-2 బొగ్గు బ్లాకుల్ని కేటాయించిందని, తాను అదే నిర్ణయాన్ని సమర్థించానని దాసరి తెలిపారు. స్క్రీనింగ్‌ కమిటీలో వివిధ మంత్రిత్వ శాఖల అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఉంటారని, వారి నిర్ణయమే అంతిమమన్నారు. బొగ్గు కుంభకోణంలో తన ప్రమేయం లేదని, నలభై మందితో కూడిన కమిటీ ఓకే చేశాకనే తాను ఫైల్స్‌ పైన సంతకం చేశానని, సిబిఐ విచారణ నేపథ్యంలో తాను గత నాలుగేళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని, తాను నిరపరాధిగా తేలుతానని అప్పుడు దాసరి విచారణలో చెప్పారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ