జార్ఖండ్ కమలందే అట

December 20, 2014 | 05:35 PM | 33 Views
ప్రింట్ కామెంట్

జార్ఖండ్ లో తుది దశ ఎన్నికల పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. అధికార పార్టీ భారతీయ జనతా పార్టీకే ఈ రాష్ట్రంలో మెజారిటీ వస్తుందని అంచనా వేశాయి. మొత్తం 81 నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీకి 41 నుంచి 49 మధ్యలో సీట్లు వస్తాయని 'ఇండియా టుడే సిసిరో ఎగ్జిట్ పోల్స్' తెలిపాయి. అటు జేఎంఎంకు 15-19, కాంగ్రెస్ కు 7-11, ఇతరులకు 8-12 వస్తాయని తెలిపాయి. జార్ఖండ్ లో తొలిసారి ఓ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ వస్తుందని చెబుతోంది. ఈ క్రమంలో బీజేపీకి 36 శాతం ఓట్లు (గతంకంటే 5.9 శాతం అదనం), కాంగ్రెస్ కు 16 శాతం (5.6 శాతం ఓట్లు), జేఎంఎంకు 20 శాతం ఓట్లు (8.8 శాతం) దక్కుతాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ