తాజ్ మహల్ కోసం నేతల తన్నులాట

December 08, 2014 | 03:20 PM | 71 Views
ప్రింట్ కామెంట్

తాజ్ మహల్ కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నేతల్లోకి ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ చేరారు. ఓ పురాతన దేవాలయంలో కొంత భాగాన్ని తీసుకొని తాజ్ మహల్‌ను నిర్మించారని ఉత్తర ప్రదేశ్ బీజేపీ చీఫ్ లక్ష్మీకాంత్ బాజ్‌పాయ్ వ్యాఖ్యానించారు. రాజా జై సింగ్ నుంచి తేజో మహాలయ టెంపుల్ లోని కొంత భాగాన్ని మొఘుల్ చక్రవర్తి షాజహాన్ కొనుగోలు చేశాడని, అందుకు సాక్ష్యాధారాలున్నాయని అన్నారు. ప్రపంచ వారసత్వ సంపదైన తాజ్ మహల్ పై అజాం ఖాన్ కన్నుపడిందని అన్నారు. తాజ్ మహల్ ఐదు సార్లు నమాజ్ చేసుకునేందుకు అంగీకరించాలన్న అజాం ఖాన్ కోరిక ఎప్పటికీ తీరదని చెప్పారు. ఇటీవల సమాజ్ వాది పార్టీ నేత ఆజంఖాన్ మాట్లాడుతూ, తాజ్ మహల్ ను వక్ఫ్ ఆస్తిగా పరిగణించాలని, వక్ఫ్ బోర్డుకు ఇవ్వాలని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆజంఖాన్ వ్యాఖ్యలకు ప్రతిగానే లక్ష్మికాంత్ బాజ్ పాయ్ మాట్లాడారని తెలుస్తోంది. ఇప్పటికే ఉత్తర ప్రదేశ్, కేంద్రం మధ్య కొనసాగుతున్న వివాదాల్లో కొత్తగా తాజ్ మహల్ చేరనుందని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు. కాగా తాజ్ మహల్ సందర్శనార్థం సందర్శకులకు ఈ టికెటింగ్ సర్వీసులను ప్రారంభించాలని ప్రధాని మోదీకి ఓ లేఖ అందింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ