ఓ వైపు వినాయక చవితి ఉత్సవాలు ఉత్సాహభరితంగా కొనసాగుతున్నాయి. వివిధ రకాల వినాయకుల ప్రతిమలు భక్తుల పూజలు అందుకుంటున్నారు. అయితే, ఇదే అదునుగా భావించిన కొంత మంది ఔత్సాహికులు తమ టాలెంటును, క్రియేటివిటిని చూపిస్తున్నారు.
వినాయకుడిని వివిధ వేషాల్లో ఏర్పాటు చేశారు. అయితే ఈ క్రమంలో సినిమాటిక్ పిచ్చిని దేవుడిపై రుద్దడం ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. దీనిపై ఉత్తరాంధ్ర సాధు పరిషత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దేవుడిని దేవుడిగా చూడాలే తప్ప, విందు వినోదాల కోసం కాదని మండిపడింది. బాహుబలి, గబ్బర్ సింగ్, సిక్స్ ప్యాక్ వినాయకుడు... ఏమిటి ఇదంతా? అని సాధువు శ్రీనివాసానంద సరస్వతి ప్రశ్నించారు. ఇంతకంటే అపరాధం, పాపం ఉంటుందా? అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేయడం వినాయకుడిని అగౌరవపరచడం కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, ఈ మేనియా దేశం మొత్తం సాగుతుంది కదా చల్తా అంటున్నారు భక్తులు. పొట్ట కూటి కోసం, విగ్రహాల అమ్మకాల కోసం వారు పైనా కింద పడి ఏదోటి చేస్తుంటే ఇంత రాద్ధాంతం అవసరమా అని అంటున్నారు.