జర్మన్ భాషను 3వ భాషగా తప్పక నేర్చుకోవాలంటూ పాఠశాలల్లో నిబంధన విధించడంపై వస్తున్న వ్యతిరేకతకు కేంద్ర ప్రభుత్వం కొంత ఊరట కలిగించింది. ఈ నేపథ్యంలో ఆ భాషను కేవలం ఓ హాబీ (అలవాటు)గా చదువుకోవచ్చని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం దేశంలోని వెయ్యి కేంద్రీయ విద్యాలయాలు, కేంద్ర ప్రభుత్వ పాఠశాలల్లో జర్మన్ ను మూడో భాషగా నేర్పుతున్నారు. అది కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు చదవుకుంటున్న పాఠశాలల్లోనే ఉంది. దీనిని వ్యతిరేకిస్తూ ఇటీవల కొందరి విద్యార్థులు తల్లిదండ్రులు సుప్రీంలో పిటిషన్ వేశారు. అంతేకాదు జర్మన్ భాషపై కేంద్ర విద్యాశాఖ మంత్రి స్మృతి ఇరానీ అసంతృప్తి వ్యక్తం చేశారు. 6 నుంచి 8 వరకు తరగతుల విద్యార్థులకు జర్మన్ ను మూడో భాషగా తప్పక చదివించాల్సినంత అవసరంలేదని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం మార్చిలో ముగుస్తుంది. అంటే, విద్యార్థులు ఇప్పటికే జర్మన్ భాష చదవి ఉండకపోతే సంస్కృతంలో వారికి పరీక్ష నిర్వహించాలన్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు తక్షణమే నేర్పించి, పరీక్ష నిర్వహించవచ్చని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఒకవేళ అలా చేయకపోతే భాషా ప్రావీణ్యంలో వారి సామర్ధ్యాన్ని అంచనా వేసేందుకు సాధ్యం కాదని తెలిపింది. జర్మన్ తోపాటు చైనీస్ కూడా మూడో అధికార భాషగా చదువుకోవచ్చునని కేంద్రం కోర్టుకు చెప్పింది.