కన్నవారి కోసం అమ్మకానికి సిద్ధమయ్యింది

November 28, 2014 | 05:35 PM | 29 Views
ప్రింట్ కామెంట్

దారిద్ర్యం... కొందరిలో పట్టుదలను పెంచి ఉన్నత శిఖరాలవైపు నడిపిస్తే, మరికొందరిని పక్కదారులు పట్టించి పతనం దిశగా తీసుకెళుతుంది! ఇంకొందరిని అసమర్థులుగా మార్చి పీల్చి పిప్పి చేస్తుంది! తాజాగా, గుజరాత్ లో ఓ మహిళ బాధలు భరించలేక తనను ఫేస్ బుక్ లో అమ్మకానికి పెట్టుకుంది. వడోదరకు చెందిన చాందిని రాజ్ గౌర్ ఫేస్ బుక్ లో తన ఫొటో పోస్టు చేసి, దానికింద ఓ సందేశం ఉంచింది. తల్లిదండ్రులకు చికిత్స చేయించేందుకు డబ్బు నిమిత్తం తనను తాను అమ్ముకుంటున్నానని ఆ సందేశంలో పేర్కొంది. తల్లిదండ్రులు మంచాన పడడంతో వారి ఆలనాపాలన అంతా చాందినీయే చూసుకుంటోంది. 20 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి వడోదర చేరుకుంది చాందిని కుటుంబం. చాందిని గతంలో మోడల్ గాపనిచేయడంతోపాటు సోషల్ వర్కర్ కూడా. ఈ విషయమై జాతీయ మీడియా ఆమెను సంప్రదించగా "నా తల్లిదండ్రుల కోసం నన్ను కొనండి" అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. తమ ఇక్కట్లు తీరాలంటే తాను అమ్ముడవడం తప్ప మరోమార్గం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నమ్ముకున్న వారే తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి స్పందించిన గుజరాత్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ లీలాబెన్ అంకోలియా చాందిని తల్లిదండ్రులకు అవసరమయ్యే చికిత్స అందించేందుకు ముందకు వచ్చారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ