హేమలత గారిని చేరుకున్న లవణం గారు

August 14, 2015 | 04:15 PM | 2 Views
ప్రింట్ కామెంట్
goparaju_rama_chandra_lavanam_niharonline

గోరాశాస్త్రి కుమారుడు లవణం. అభ్యుదయ భావాలు, నాస్తిక వాదం సాత్వికతతో కూడిన తిరుగుబాటు తత్వం… గుర్రం జాషువాగారి అమ్మాయి హేమలత గారితో జీవన యానం. సమాజంలో కుళ్లు కడగాలనే తపనతోనే ఇద్దరూ కలిసి శ్రమించేవారు. చెల్లి నిలయం స్థాపించి నిజామాబాద్ జిల్లాలో వర్ని ప్రాంతంలో నెలకొన్న జోగిని వ్యవస్థను రూపు మాపేందుకు శతధా ప్రయత్నించేరు. అస్పృశ్యతను నిర్మూలించేందుకు శక్తియుక్తలు ధారపోసేరు. లోకనాయక జయప్రకాష్ నారాయణతో కలిసి చంబల్ బందిపోటు దొంగలను లొంగిపోయేందుకు దోహదపడిన ధీశాలి హేమలత.
లవణం గారి పేరు గోపరాజు రామచంద్రలవణం. ఈ దంపపతులిద్దర్నీ సమాజం శక్తిమేరకు గౌరవించుకుంది ప్రభుత్వంతో సహా. అభ్యుదయ భావాలు, త్యాగనిరతి, సేవా భావం ఇవన్నీ కలగలిపిన పూదోటలో గుబాళించిన పరిమళభరిత పుష్పాలే గోరా శాస్త్రి, జాషువా, హేమలతాలవణం, లవణం. పునర్జన్మలాంటి విశ్వాసాలకు అతీతమైన ఈ మానవ సౌజన్యమూర్తులు తిరిగి మన మధ్యే జన్మించి దారి చూపించగలందులకు కోరుకుందా! 

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ