10 లక్షలు ఇచ్చినా మేకను అమ్మటంలేదు

September 26, 2015 | 05:46 PM | 4 Views
ప్రింట్ కామెంట్
goat-allah-letters-10lakhs-chattisgarh-niharonline

అవసరమనుకుంటే అనుబంధాలను సైతం అమ్ముకునే రోజులివి. మనుషుల్లో అంత స్వార్థం పెరిగిపోయింది. కానీ, ఆ మూగజీవిపై అతని మమకారం వెల కట్టలేనిది. బక్రీద్ వస్తోందంటే చాలు, ప్రేమగా పెంచిన మేకల్ని వీలైనంత ఎక్కువ ధరకు అమ్మి సొమ్ము చేసుకుందామనుకుంటారు చాలామంది. కానీ, ఓ పేద ముస్లిం మాత్రం తన మేకను 10 లక్షలు ఇచ్చినా అమ్మనని తెగేసి చెబుతున్నాడు. అసలు అంతలా స్పెషల్ ఆ మేకలో ఏముంది?

               ఛత్తీస్ గఢ్ లోని కోబ్రా జిల్లాకు చెందిన అబ్దుల్ రజాక్ అలీ అనే రోజు కూలీ దగ్గర ఎరుపు, తెలుపు రంగుల్లో వుండే ఓ మేక ఉంది. ఓ రోజు దానిని మేపుతుండగా, దాని ఒంటిపై ఉన్న మచ్చలు అల్లా అనే ఉర్దూ అక్షరాలను పోలి ఉండడాన్ని అలీ తొమ్మిదేళ్ల కుమారుడు గుర్తించాడు. వెంటనే తన తండ్రి, స్నేహితులకు ఆ విషయాన్ని చెప్పాడు. ఈ వార్త చుట్టుపక్కల తెలియడంతో ఓ వ్యక్తి దాని ఫోటో తీసి, సోషల్ మీడియాలో పెట్టాడు. అంతే, ఆ మేక సెలబ్రిటీ అయిపోయింది. దానిని చూసేందుకు స్థానికులు తండోపతండాలుగా వస్తున్నారు. ఈ మేకను రజాక్ అలీ 9,600 రూపాయలకు కొనుగోలు చేయగా, దాని గురించి తెలుసుకున్న పలువురు 'పది లక్షలిస్తాం మాకివ్వండి' అని అడుగుతున్నారట. అయితే, రజాక్ మాత్రం వారి ఆఫర్లను తిరస్కరిస్తున్నాడు. ఎన్ని లక్షలిచ్చినా ఇచ్చేది లేదంటున్నాడు! దేవుడి పేరు  ఉన్నందునే కాదని, అపురూపంగా పెంచుకుంటున్న మేకను డబ్బు కోసం అమ్ముకునే పరిస్థితుల్లో లేమని రజాక్ చెబుతున్నాడు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ