యంగిస్థాన్ ‘‘భారత్’’

November 19, 2014 | 03:41 PM | 28 Views
ప్రింట్ కామెంట్

ప్రపంచంలో అత్యధిక యువ జనాభా గల దేశంగా భారత్ ఆవిర్భవించింది. దేశంలో 10 నుంచి 24 ఏళ్లలోపు ఉన్నవారి సంఖ్య దాదాపు 34.6 కోట్లుగా ఉందని ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న చైనా కంటే కూడా భారత్ లోనే యువ జనాభా ఎక్కువగా ఉందని సంస్థ తెలిపింది. 26.9 కోట్లతో చైనా రెండోస్థానంలో ఉండగా, ఇండోనేషియా (6.7కోట్లు), అమెరికా(5.9 కోట్లు) తర్వాతి స్థానాలలో ఉన్నాయి. రాబోయే రోజులన్నీ యువతరానిదేనని, వీరి నుంచే గొప్ప గొప్ప నాయకులు, మేధావులు, విద్యావేత్తలు తయారవుతారని తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాల కంటే అభివృద్ధి చెందుతున్న దేశాలు యువ జనాభా సంక్షేమంపై దృష్టి సారించాలని ఆయా దేశాల ప్రభుత్వాలకు సూచించింది. యువతకు నాణ్యమైన విద్యా, వైద్య సదుపాయాలు కల్పించడం ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చునని యూ.ఎన్.ఎఫ్.సీ.ఏ పేర్కొంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ