చేతబడులు, క్షుద్ర పూజలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు కర్నాటక రాష్ట్ర మంత్రి సతీష్ జర్కిహోలి రాత్రంతా బెలగావి స్మశానంలో గడిపారు. వైకుంఠధామ్ స్మశానంలో ఆయన, ఆయన అనుచరులు అక్కడే భోజనాలు ముగించి పడకేశారట. దహన సంస్కారాలు జరిగే చోట రాత్రిపూట దయ్యాలు ఉంటాయన్న నమ్మకాన్ని పోగొట్టడం తన తొలి ఉద్దేశమని ఆయన అన్నారు . పడుకుంటే పడుకున్నారు కానీ ఆఖర్లో స్మశానాలు పుణ్య క్షేత్రాలతో పోల్చారాయన. అంతేకాదు ‘‘మన దేశంలో లక్ష్మీదేవీని పూజిస్తే ధనికులవుతారని చెబుతారు. మరి ఏ లక్ష్మీదేవిని కొలుస్తున్నాడని బిల్ గేట్స్ ప్రపంచంలో అత్యధిక ధనవంతుడిగా చెలామణి అవుతున్నాడు. అలాగే నేను కూడా లక్ష్మీదేవీని పూజించను అయినప్పటికీ ఏడాదికి 600 కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు.