పెద్దాయనతో పెట్టుకుంటే మటాషే...!

November 29, 2014 | 11:08 AM | 37 Views
ప్రింట్ కామెంట్

డీఎంకే అధినేత కరుణానిధి తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దమ్ముంటే అసెంబ్లీ ముందు వరసులో తనకు ప్రత్యేక సీటు వేయించాలని సవాలు విసిరారు. వయోభారంతో వీల్‌ఛైర్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. ఎక్కడికి వెళ్లాలన్న ఈ అత్యాధునిక టెక్నాలజీతో సిద్ధం చేసిన వీల్ ఛైర్‌లో ఆయన వెళతారు. అలాంటి కరుణానిధికి అసెంబ్లీలో సమస్య ఎదురైంది. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక జార్జికోటను అసెంబ్లీగా మార్చివేసింది. అక్కడ కరుణ వీల్ ఛైర్ వెళ్లే విధంగా ఏర్పాట్లు లేదు. ఆ ఛైర్‌లో అసెంబ్లీలో కూర్చునేంతగా స్థలం లేదు. ప్రధాన ప్రతిపక్షం డీఎండీకేకు వెనుక డీఎంకే సభ్యులకు సీట్లు కేటాయించారు. తాను అసెంబ్లీకి వచ్చేందుకు ప్రత్యేక సీటు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని పలుమార్లు కరుణానిధి కోరారు. అయితే స్పందన లేదు. దీంతో అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ఏదో ఒక రోజు వచ్చి సంతకం పెట్టి వెనుదిరగడం కరుణానిధికి పరిపాటిగా మారింది. అయితే కరుణానిధిని ఉద్దేశించి పన్నీరు సెల్వం సవాలు విసరడంతో పెద్దాయనకు ఎక్కడో కాలింది. ధైర్యముంటే అసెంబ్లీలో అడుగు పెట్టు అని పన్నీరు సెల్వం విసిరిన సవాలును తిప్పికొట్టే విధంగా శుక్రవారం కరుణానిధి స్పందించారు. అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు తాను సిద్ధమని కరుణానిధి స్పష్టం చేశారు. అయితే తనకు ప్రత్యేక సీటును ముందు వరుసలో వేయించాలని, అందుకు తగ్గ ధైర్యం ఉందా..? అని సీఎం పన్నీరు సెల్వానికి సవాల్ విసిరారు. అసెంబ్లీలో తాను సంధించే ప్రశ్నలకు మహా మహులే సమాధానాలు ఇవ్వలేక తడపడ్డ సందర్భాల ఉన్నాయని, ఇక తమరు ఎంత అని మండిపడ్డారు. ఎంజీఆర్ లాంటి వారే మరుసటి రోజు వచ్చి తనకు సమాధానాలు ఇచ్చేవారని, తాను మహామహుల్ని చూశానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు బాధ్యతతో హుందాగా వ్యవహరించడం అలవాటు చేసుకోవాలని, దిగజారుడు వ్యాఖ్యలు చేస్తే సహించబోనని హెచ్చరించారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ