బంపరాఫర్ : అక్కడ బండి కొంటే 2 హెల్మెట్లు ఫ్రీ

September 23, 2015 | 01:05 PM | 3 Views
ప్రింట్ కామెంట్
helmet-free-for-bike-madras-court-ordered-niharonline

ఏటా రోడ్డు ప్రమాదాల కారణంగా ఎన్నో లక్షల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆ మధ్య సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తంచేసింది. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తోపాటు, నిర్లక్ష్యంతో కూడా భారీ మూల్యం చెల్లించుకుంటున్న వారు ఎందరో అంటూ పేర్కొంది. కనీసం కొంతలో కొంతైనా ప్రమాదాల నివారణకు కృషి చెయ్యాలని, అవసరమైతే కఠిన నిబంధనలను అమలు చెయ్యటానికి వెనుకాడొద్దని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

కట్ చేస్తే... మద్రాస్ హైకోర్టు ద్విచక్ర వాహనదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్తగా ద్విచక్రవాహనాలు కొనుగోలు చేసే వారికి తప్పనిసరిగా రెండు హెల్మెట్లు, వాటితోపాటు వాహనాలకు హెల్మెట్ లాక్ ఉండేలా చూడాలని వాహన తయారీదారి కంపెనీలను మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. తయారీలో భాగంగా హెల్మెట్ లాక్ తయారు చేయించాలని,  ఎక్స్ ట్రా ఫిటింగ్ చార్జీలు వసూలు చేయవద్దని న్యాయస్థానం సూచించింది. హెల్మెట్లు వాడకం తప్పనిసరి అయినప్పటి నుంచి రోడ్డు ప్రమాదాల మృతుల సంఖ్య తగ్గుతున్న విషయాన్ని కోర్టు వెల్లడించింది. హెల్మెట్ ధరించాలన్న నిబంధన పట్టణ ప్రాంతాల్లో అమలవుతున్నట్లుగానే,  గ్రామీణ ప్రాంతాల్లోనూ అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మద్రాసు హైకోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాల మేరకు తమిళనాడు రాష్ట్రంలో జూలై 1 నుంచి ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ వాడకం తప్పనిసరి అయింది. అది సత్ఫలితం ఇవ్వటంతో తాజా ఆదేశాలను జారీచేసింది.   

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ