తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. వీళ్లిద్దరు ఒకే వేదికపై ఉన్నప్పుడు ఉండే ఆర్భాటం అంతా ఇంతా కాదు. ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలతోపాటు మీడియా కూడా ఈ సందర్భాన్ని ఓ విశేషంగా భావిస్తారు. పైకి రాజకీయాల పరంగా కత్తులు దూసుకునే వీళ్లద్దరు బయట కలుసుకున్నప్పుడు మాత్రం ఉండే ఆత్మీయత అలాంటిది. అలాంటి వీళ్లద్దరిని ఒకే వేదికపై చూడాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆత్రుత పడుతున్నారట. ఢిల్లీలో నిర్వహించబోయే అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశానికి వీరిద్దరు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఈ తెలుగు ముఖ్యమంత్రులతో సమావేశం కావాలని ఆరాటపడుతున్నారట. ఇప్పటి వరకు మోదీ ఈ ఇద్దరు విడివిడిగా కలిసినప్పటికి ఒక్కటిగా ఎప్పడూ సమావేశం కాలేదు. అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ మోదీతో వీళ్లిద్దరి సమావేశం ఉంటుందని ప్రధాని కార్యాలయ వర్గాలు తెలుపుతున్నాయి. అది మోదీ కొరుకుంటున్నట్లు ఒకేసారా? లేక విడివిడిగానా అన్నది ఖరారు కావాల్సి ఉంది.