నిర్లక్ష్యంతో 15 మంది అంధులయ్యారు

December 06, 2014 | 05:42 PM | 124 Views
ప్రింట్ కామెంట్

ఛత్తీస్‌గఢ్‌ బిలాస్‌పూర్‌లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు విఫలమై మహిళలు మరణించిన ఘటన మరువకముందే… ఇప్పుడు వైద్యుల నిర్లక్ష్య ధోరణికి మరో ఘటనలో 15 మంది అంధులుగా మారాల్సి వచ్చింది. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో నాలుగు రోజుల క్రితం ఓ స్వచ్ఛంద సంస్థ ప్రభుత్వ డాక్టర్ల సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఈ శిబిరంలో దాదాపు 200 మందికి కంటి శుక్లాల శస్ర్త చికిత్స నిర్వహించారు. అయితే వారిలో కొందరికి కంటిలో తీవ్ర మంటలు రావడంతో అమృత్‌సర్‌ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు వారిని పరిక్షించి కంటి చూపు పోయినట్లుగా నిర్థారించారు. దీంతో వాళ్లు లబోదిబో మంటున్నారు. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ నిమిత్తం ఓ కమిటీని నియమించింది. వైద్యరంగ చరిత్రలో నిర్లక్ష్యానికి ఇది మరో ఉదాహరణ అని విమర్శలు వినవస్తున్నాయి. వీరంతా 60 ఏళ్లకు పైబడిన వారే.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ