ఆత్మహత్యయత్నంకు నో కేస్

December 10, 2014 | 05:07 PM | 34 Views
ప్రింట్ కామెంట్

ఇక మీదట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వారిపై క్రిమినల్ కేసులు ఉండబోవు. భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 309ను తొలగించాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకూ, ఐపీసీ సెక్షన్ 309 ప్రకారం ఆత్మహత్యాయత్నం కేసు రుజువైతే గరిష్ఠంగా ఒక సంవత్సరం వరకూ జైలు శిక్ష పడుతుంది. కేంద్ర న్యాయ కమిషన్ హ్యూమనైజేషన్ అండ్ డీ క్రిమినలైజేషన్ అఫ్ అటెంప్ట్ టూ సూసైడ్ పేరిట చేసిన సిఫార్సులను కేంద్రం ఆమోదించింది. చట్ట సవరణ కోసం రాష్ట్రాల అభిప్రాయాలను కోరగా, 18 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి సానుకూల స్పందన రావటంతో ఆత్మహత్యను నేరంగా పరిగణించే ఐపీసీ సెక్షన్ 309ను తొలిగిస్తూ, చట్ట సవరణ చేయనున్నట్టు కేంద్రం వెల్లడించింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ