దొంగ బాబా దగ్గర డబ్బుల్లేవట...

December 10, 2014 | 01:43 PM | 39 Views
ప్రింట్ కామెంట్

కోట్ల విలువ చేసే ఆస్తులు కూడబెట్టిన రాంపాల్ బాబా బెయిల్ లభించినప్పటికీ, తన వద్ద పూచీ కత్తులు చెల్లించేందుకు వద్ద రూ.20 వేలు కూడా లేవని జైల్లోనే గడుపుతున్నారట. స్వర్గలోకపు ప్రవేశానికి ఒక్కో టికెట్ ను రూ.1 లక్షకు విక్రయించిన బాబా రాంపాల్ వద్ద ప్రస్తుతం చిల్లి గవ్వ కూడా లేవని చెప్పటంతో వినేవారు విస్తుపోతున్నారు. ప్రస్తుతం బెయిల్ పై రాంపాల్ విడుదలైనా తిరిగి ఆయనను అరెస్ట్ చేస్తారని సమాచారం. ఈయన అరెస్టు చేయడం ఎంతో కష్టంతో కూడుకున్నదని తెలిసినా హర్యానా ప్రభుత్వం చాలా రిస్టు తీసుకొని, ఎంతో ఖర్చుపెట్టి ఈ సాహసం తలపెట్టింది. ఇప్పటికే ఈయన అరెస్టుకు రూ. 26.61 కోట్లు వ్యయం చేశామని హర్యానా పంజాబ్- హర్యానా హైకోర్టుకు సమర్పించిన నివేదికలో తెలిపింది. ఈ’ వ్యయాన్ని ఆయన నుంచే రాబట్టాలని కోర్టు సూచించింది. ఈ కేసు విచారణను కోర్టు డిసెంబర్ 23కు వాయిదా వేసింది. ఆరోజున రాంపాల్ సహ నిందితులు రాంపాల్ ఢాకా, ఓపీ హుడాలను కూడా పోలీసులు కోర్టులో హాజరు పరచాల్సి ఉంటుంది. ఇప్పటివరకు రాంపాల్ అనుచరుల్లో దాదాపు 900మందిని వివిధ ఆరోపణలపై అరెస్టు చేశారు. రాంపాల్ కోట్లను గడించడమే కాకుండా, ముఖ్యంగా అందమైనవారిని శిష్యురాళ్ళుగా చేర్చుకుని రాసక్రీడలు సాగిస్తున్నాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. బాబా ప్రైవేట్ గదిలో వ్యవహారాలు నడిపేవాడని తేలింది. తన శిష్యురాళ్లలో కొంతమందిని మాత్రమే తన గదిలోకి అనుమతించేవాడనీ, వారితో లైంగిక కలాపాలకు సంబంధించిన కొన్ని ఆధారాలు బయట పడ్డాయని హర్యానా పోలీసులు వెల్లడి చేశారు. ఆయన శిష్యురాళ్లలో 27 ఏళ్ళ బబితా కుమారి ఇతనికి సన్నిహితురాలు. ఈమె ఆయన శిష్యుడి కూతురే అని చెబుతున్నారు. ఈమెకు ఆయన పర్సనల్ విషయాలన్నీ తెలుసుననీ, ఆమె లాప్ టాప్, సీడీలు, టెలిఫోన్లు, డైరీలవంటివన్నీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాగా బాబా గదిలో ప్రెగ్నెన్సీ కిట్‌ను, లైంగికోత్తేజాన్ని పెంపొందించే మందులను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. బబిత కూడా పోలీసుల రిమాండ్ లోనే ఉంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ