కేంద్ర మంత్రి నిరంజన్ జ్యోతి వివాదాస్పద వ్యాఖ్యాలపై మోదీ మరోకసారి పార్లమెంట్ లో వివరణ ఇచ్చారు. శుక్రవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే మోదీ లోక్ సభలో ప్రసంగిస్తూ... సాధ్వీ ఇప్పటికే క్షమాపణ చెప్పింది. విపక్షాలు ఈ విషయాన్ని వదిలేసి సభ కార్యకలాపాలకు సహకరించాలి అని కోరారు. ఆమె గ్రామీణ నేపథ్యంలోంచి వచ్చిందని దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేయోద్దని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు పార్లమెంట్ బయట రాహుల్ నేతృత్వంలోని ఎంపీలంతా నోటికి నల్ల గుడ్డ కట్టుకోని నిరసన తెలిపారు. క్షమాపణ తెలిపిందంటే ఆమె తప్పు చేసిందని ఒప్పుకున్నట్టేనని, కాబట్టి ఆమె తప్పకుండా రాజీనామా చేయాల్సిందేనని సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. మైనార్టీలను కించపరుస్తూ ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు రోజులుగా విపక్షాలు పార్లమెంట్ లో సభా నిర్వహణకు అడ్డుతగులుతునే ఉన్నారు.