దేశ ప్రథమ పౌరురాలి కన్నుమూత

August 18, 2015 | 03:31 PM | 3 Views
ప్రింట్ కామెంట్
Pranab_mukharjee_wife_suvra_died_niharonline

దేశ రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ సతీమణి శుభ్రా  ముఖర్జీ మృతిచెందారు. ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ముఖర్జీని ఆగష్టు 7 న ఆస్పత్రిలో చేర్చగా,  ఐసీయూలో ఉంచి వైద్యులు చికిత్స అందించారు. సతీమణి ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీలోనే ఉంటు తప్పనిసరి అయిన అధికారిక కార్యక్రమాలలో మాత్రమే పాల్గొన్నారు. మరిన్ని వివరాలు అందాల్సి ఉంది. సెప్టెంబర్ 17, 1940 జెస్సోర్ లో జన్మించిన ఆమె ప్రణబ్ ను 1957 జులై 13 న వివాహం చేసుకున్నారు. ఆమె మంచి గాయని కూడా. గీతాంజలి ట్రూప్ ను నెలకొల్పి ప్రదర్శనలు కూడా ఇఛ్చారు.

ఇక శుభ్రా ముఖర్జీ మృతి పట్ల పార్టీల ప్రముఖులు, నేతలు సంతాపం ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ముఖర్జీ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ