శ్రీమంతుడు మహేష్ కాదు... మాస్టర్

September 25, 2015 | 02:52 PM | 4 Views
ప్రింట్ కామెంట్
sachin-Puttamraju-Kandrika-best-village-niharonline

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మైదానంలో అయితే రాణించాడు కానీ రాజకీయాల్లో ఇంకా ఓనమాలు దిద్దలేదు. అందుకే ప్రత్యక్ష రాజకీయ రంగంలోకి దిగాలనే ఆలోచనగానీ, ఆ వంతు ప్రయత్నంగానీ చెయ్యలేదు. అయితే పరిస్థితుల ప్రభావంతో ఆయన రాజ్యసభ సభ్యుడిగా మారాల్సి వచ్చింది. ఎంపీగా అయితే ఉన్నారే గానీ ఎనాడూ పొలిటికల్ బిల్డప్పూ ఇచ్చిన పాపాన ఆయన పోలేదు. పైగా సమాజ సేవలోనూ ఆయన ఎప్పుడూ ముందుంటారు కూడా.

ఇక దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన లో భాగంగా సచిన్ టెండుల్కర్ కూడా ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. అది ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఓజిలి మండలంలోని పుట్టంరాజువారికండ్రిగ. ఇక ఇప్పుడు ఈ దత్తత గ్రామం జాతీయస్థాయిలో పురస్కారం కైవసం చేసుకుంది. సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన లో ఉన్న ఊర్ల జాబితాలో ఆదర్శ గ్రామంగా పుట్టంరాజువారికండ్రిగకు పురస్కారం లభించింది. మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో  నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి చౌదరి వీరేంద్ర సింగ్ నుంచి నెల్లూరు జిల్లా సంయుక్త పాలనాధికారి ఇంతియాజ్ అహ్మద్ ఈ పురస్కారం అందుకున్నారు. సచిన్ దత్తత గ్రామంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా జేసీ అహ్మద్ అక్కడ కూలంకషంగా వివరించారట. సినిమాలో మహేష్ శ్రీమంతుడైతే... రియల్ లైఫ్ లో మాత్రం సచినే. హాట్సాఫ్ టూ మాస్టర్.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ