లెక్చరర్ల పొట్ట కొడుతున్న సీనియర్ విద్యార్థులు

August 14, 2015 | 03:50 PM | 2 Views
ప్రింట్ కామెంట్
students_dharna_niharonline

జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో సీనియర్ విద్యార్థులతో జూనియర్లకు క్లాసులు పీకిస్తున్నారట. ఇంకేముంది. జాయింట్ యాక్షన్ రంగంలోకి దిగి, తరగతుల బహిష్కరణ, ధర్నా వగైరా శాంతియుత చర్యలు చేపట్టేరు. ఎంటెక్ చదువుకుంటున్న సీనయిర్లు బిటెక్ పాసయి ఉంటారు. సందేహం లేదు. లెక్చరర్ల కొరత లాంటి తాత్కాలిక సమస్య అధిగమించేందుకు ఇలాంటి తాత్కాలిక ఏర్పాట్లు ఫర్వాలేదు. జ్ఞానం ఉన్న యాజమాన్యం ఏదైనా ఇదే శాశ్వత చిట్కా అనుకోకూడదు. ధర్మం కాదు. విద్యార్థి లోకం కోపగించుకోకుండా ఎందుకుంటుంది. ప్రిన్సిపాల్ గారు భావి భారత ఇంజనీర్లను లాలించి సమస్య పరిష్కారానికి మరి రెండు రోజుల్లో కనిపెట్టగలనని హామీ ఇచ్చేరు. తమ్ముళ్ళు ఆందోళన ఆపు చేసేరు. ఇటువంటి అపోహలకు తావిచ్చే ఘనకార్యులకు ముందే, పిల్లల్లారా ఇట్టి పరిస్థితుల్లో ఈ విధమైన ఏర్పాట్లు చేయవలసి వస్తోంది. రెండు రోజుల్లో అంతా సర్దుకుంటుంది అని చెప్పి స్నాక్సు, ఛాయలతో పండగవాతావరణం క్రియేట్ చెయ్యొచ్చు. అలా అయితే థ్రిల్లు ఉండదు మరి.
సుమారు నలభై సంవత్సరాల ప్రాంతంలో ఉస్మానియా ఆవరణల్లో జార్జిరెడ్డి పేరు మ్రోగుతూ ఉండేది. సీనియర్లకీ, జూనియర్లకీ పాఠాలు చెప్తుండేవాడని గొప్పగా చెప్పుకునేవారు. ప్రస్తుత సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఆయనకు అనుంగు మిత్రుడు. కాలంవేసిన కాటుకి జార్జిరెడ్డి అమర్ హై అనే నినాదాలు గోడల మీద రాతలు మిగిలేయి. మెరిట్స్ పంచనివ్వండి ! ఆహ్వానించండి ! 

 

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ