పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్, టెన్నిస్ బ్యూటీ సానియా మీర్జా జంట గత కొంతకాలంగా విడిపోతారన్న వార్త హల్ చల్ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఆ గాసిప్ కి ఫుల్ స్టాప్ పెట్టాలని షోయబ్ నిర్ణయించుకున్నాడు. ‘‘సానియాతో నాది విడదీయలేని బంధం. ఇప్పటికీ మేమిద్దరం దుబాయ్ లో కలిసే ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తుంటాం. కానీ, క్రీడాకారులుగా మా బాధ్యతలు కూడా మాకుంటాయి కదా. అలాంటప్పుడు దూరంగా ఉండాల్సి వస్తుంది. అంత మాత్రానికే మేం విడిపోతున్నాం అని కథనాలు ప్రచురించడం భావ్యం కాదు’’ అని చెప్పుకొచ్చాడు. పాక్ నటి హమైమ మాలిక్ తో మరియు ఆమె కుటుంబంతో షోయబ్ ఈ మధ్య సన్నిహితంగా మెలుగుతున్నాడు. దీంతో సానియా షోయబ్ లు విడిపోతున్నారనే వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ డెయిలీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాలిక్ ఈ విషయాలు చెప్పాడు. హమైమ మంచి స్నేహితురాలు మాత్రమేనని తెలిపాడు. ఇక తమ దాంపత్యం బాగానే ఉందని చెప్పేందుకు సానియా షోయబ్ తో సన్నిహితంగా ఉన్న ఫోటోను ఈ మధ్యే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసింది.