భారత్ గురించి ఆశ్చర్యపరిచే ఆరు ఆసక్తికర విషయాలు

August 28, 2015 | 12:33 PM | 2 Views
ప్రింట్ కామెంట్
six_intresting_unknown_facts_about_india_niharonline.jpg

మన దేశ చరిత్ర చాలా గొప్పది. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. తవ్వే కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగుచూస్తుంటాయి. అలాంటి వాటిల్లో ఆసక్తికరంగా అనిపించే ఓ ఆరు విషయాలు మీకోసం...

1. ధ్యాన్ చంద్: మేరా భారత్ మహాన్  1936 లో బెర్లిన్ లో జరిగిన ఒలంపిక్స్ లో భారత్ జర్మనీని 8-1 తేడాతో మట్టికరిపించింది. అది హాకీ లెజెండ్ ధ్యాన్ చంద్ ఆధ్వర్యంలో... ధ్యాన్ చంద్ ప్రతిభకు ముగ్ధుడైపోయిన హిట్లర్ జర్మనీ తరపున ఆడాల్సిందిగా ఆహ్వానించాడట. ప్రతిగా జర్మనీ పౌరసత్వంతోపాటు, సైన్యంలో అత్యున్నత పదవిని ఇస్తానని ఆశపెట్టాడట. కానీ, ధ్యాన్ చంద్ వాటన్నింటినీ చిరునవ్వుతో తిరస్కరించాడట.

2. పూర్తిస్థాయి స్వదేశీ కంపెనీ ఏదో తెలుసా? కేవలం 10లక్షల రూపాయలతో 1958లో ప్రారంభించబడి అనంతికాలంలోనే మల్టీ బిలియన్ కంపెనీగా ఎదిగిన ఎలక్ట్రికల్ ఉత్పత్తుల కంపెనీ హావెల్ మనదేశానికి చెందినదే. దీని యజమాని హవెలీ రామ్ గుప్తా. పూర్తి స్వదేశీ పరిజ్నానంతో యాజమాన్యంతో నడపబడిన మొట్టమొదటి కంపెనీ ఇదే.

3.  ప్రథమ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ జీతం ఎంతో తెలుసా? ఆయన తనకు వచ్చే జీతంలో కేవలం 50 శాతం మాత్రమే తీసుకునేవాడట. అంతకు మించి ఒక్క పైసా కూడా వద్దని చెప్పేవాడట. ఇక 12 ఏళ్ల పదవీకాలం ముగిసే సమయానికి కేవలం 25 శాతం మాత్రమే తీసుకున్నారట. ఆ టైంలో ఆయన జీతం 10 వేలు మాత్రమే. ( ప్రస్తుతం రాష్ట్రపతి జీతం 1,92,000 రూపాయలు).

4. మొదటి రాకెట్ ను ఎలా మోసుకొచ్చారో తెలుసా? 1963 లో ఇస్రో తుంబా లాంచింగ్ స్టేషన్ నుంచి మొదటి రాకెట్ ను ప్రయోగించింది. అది ఎక్కడో తెలుసా? కొబ్బరిచెట్ల మధ్య ఉన్న ఓ సింగిల్ లాంఛ్ ఫ్యాడ్ నుంచి... సమీపంలోని ఓ క్యాథలిక్ చర్చిని లాంచింగ్ స్టేషన్ కి ఆఫీస్ కార్యాలయంగా, ఆ చర్చి బిషప్ ఆఫీస్ ను వర్క్ షాపుగా మార్చుకుని వాడుకున్నారట. పక్కనే ఉన్న పశువుల పాకను లాబోరేటరీ గా వాడుకుని అబ్దుల్ కలాం లాంటి యువ శాస్త్రవేత్తలంతా కలిసి శ్రమించారట. ఇంతకీ లాంచ్ ఫ్యాడ్ దాకా దాన్ని ఎలా మోసుకోచ్చారో తెలుసా? సైకిల్ మీద. అలాగే రెండో రాకెట్ కాస్త బరువు ఉండటంతో ఎడ్ల బండిపై తీసుకువచ్చారట.

5. ఒక్క ఓటర్ కోసం పోలింగ్ బూతు!  కేవలం ఉన్న ఒక్క ఓటర్ కోసం పోలింగ్ బూతు నెలకొల్పారు. అదీ ఇండియాలోనే. గుజరాత్ లోని గిర్ అడవుల్లో బానెజ్ అనే ప్రాంతం అది.  మహంత్ భరత్ దాస్ దర్శన్ దాస్ అనే  సాధువు 2004 నుంచి ఓటు వేస్తువస్తున్నాడు. అతగాడి కోసం ఎన్నికల కమిషన్ అక్కడ ఒక ప్రత్యేక పోలింగ్ బూతు నెలకొల్పింది.  

6. కలాం మేధస్సుకు గౌరవమిచ్చిన దేశం? ఇండియన్ మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం 2006 లో స్విట్జర్ లాండ్ పర్యటనకు వెళ్లారు. ఆయన రాక సందర్భంగా సంబురాలు నిర్వహించిన ఆ దేశం అడుగుపెట్టిన తేదీని (మే 26) సైన్స్ దినంగా ప్రకటించింది.

తేలియాడే పోస్టాఫీస్!! ప్రపంచంలోనే అత్యధిక పోస్టాఫీసులు ఉన్న దేశంగా (1,55,015) భారత్ పేరుగాంచింది. కానీ, ఒక్క పోస్టాఫీస్ మాత్రం నీటిలో తేలుతూ కనిపిస్తుంటుంది. ఆగస్టు 2011 లో శ్రీనగర్ లోని ప్రముఖ దాల్ సరస్సులో ఈ పోస్టాఫీసు సేవలను ప్రారంభించారు. ఇది ఇప్పుడు దాదాపు 7,715 మంది జనాభాకు సేవలందిస్తోంది. ఇవే కాదు... షాంపూ ను కనిపెట్టిందే భారతే. సంస్కృతంలో చంపూ అంటే మసాజ్ అని అర్థం. మొదటగా ఆయుర్వేదాలతో దానిని కనిపెట్టారట. క్రమంగా అదే షాంపూ అయ్యింది. ముంబైలో సముద్రంపై ఉన్న బాంద్రా వర్లీ సీ లింక్ వాడిన వైర్లు భూమి మొత్తం వైశాల్యం ఎంత ఉంటుందో అంతనటా.  అది 50,000 ఆఫ్రికన్ ఏనుగులకు సమానం. ఇంకా ఇలాంటివి ఎన్నో...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ