ఉత్తర కోల్ కతాలోని జొరాసాంకోలో ఉన్న విశ్వకవి, నోబుల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగోర్ పూర్వీకుల ఇంటిని వారసత్వ సంపదగా సంరక్షించనున్నట్టు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఇదొక వారసత్వం నిర్మాణం. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి, విదేశాల నుంచి కూడా ఆ ఇంటిని చూసేందుకు పర్యాటకులు వస్తున్నారు. అందుకే దాన్ని రాష్ట్ర వారసత్వ సంపదగా చేయాలని నిర్ణయించాం అని ఆమె మీడియాకు వివరించారు. కాగా, ఈ ఇంటిలో ఉన్న రవీంద్రభారతి విశ్వవిద్యాలయ క్యాంపస్ ను రాజహత్ న్యూ టౌన్ ప్రాంతానికి మార్చనున్నట్టు మమతా చెప్పారు. అక్కడ పదెకరాల స్థలాన్ని విశ్వవిద్యాలయ అథారిటీకి ఇస్తున్నామన్నారు.