యూపీలో మరో ‘మాసాయిపేట్’ ప్రమాదం

December 06, 2014 | 04:02 PM | 42 Views
ప్రింట్ కామెంట్

మెదక్ జిల్లా మాసాయిపేట్ వద్ద స్కూల్ బస్సు ప్రమాదం మరవక ముందే సరిగ్గా అలాంటి ప్రమాదమే మరోకటి జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలోని మావ్‌ జిల్లాలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. స్కూలు బస్సును రైలు ఢీకొంది. ఈ ఘటనలో ఐదుగురు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. మరో 20 మందికిగా పైగా గాయపడ్డారు. మానవ రహిత లెవల్‌ క్రాసింగ్‌ వద్ద ఓ స్కూలు బస్సు పట్టాలు దాటే ప్రయత్నం చేస్తుండగా వారణాసి వెళ్తున్న తామసా ఎక్స్‌ప్రెస్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 30 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. గాయపడిన చిన్నారులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. చిన్నారుల తల్లిదండ్రుల రోదనలతో ఆస్పత్రి వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. కాగా, ఈ ఘటనపై కేంద్ర రైల్వేశాఖామంత్రి సురేష్ ప్రభు లోక్‌సభలో స్పందించారు. మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. అలాగే, లెవల్ క్రాసింగ్ వద్ద సిబ్బందిని నియమిస్తామని తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ