దేశ ఆర్థిక స్థితి గతులను మెరుగుపరిచేందుకు మోదీ సర్కారు మరో ఐడియా ను వేసింది. సరికొ్త్త పథకంతో పురోగతి సాధించేదిశగా ఓ కొత్త పథకానికి రూపకల్పన చేసింది. దేశ ప్రజల వద్ద పోతపోసినట్లు ఉన్న టన్నుల బంగారాన్ని బ్యాంకుల్లోకి తేవాలని ప్రయత్నిస్తోంది. తద్వారా దేశాభివృద్ధికి ఉపయోగించాలని ఆలోచించింది. గోల్డ్ మానిటైజేషన్ స్కీం పేరిట కేంద్ర క్యాబినెట్ ఈ సరికొత్త బంగారం డిపాజిట్ పథకాన్ని ప్రకటించింది.
దేశవ్యాప్తంగా 20వేల టన్నుల బంగారం ఉందని ఒక అంచనా. దీని మార్కెట్ విలువ సుమారు రూ.60లక్షల కోట్లుగా చెబుతున్నారు. ఈ బంగారాన్ని వీలైనంతవరకూ బ్యాంకుల్లో గోల్డ్ బాండ్ల రూపంలో మార్చగలిగితే.. దేశ ఆర్థిక వ్యవస్థకు సరికొత్త జవసత్వాలు వచ్చే వీలుంది. ఇందులో భాగంగా 5 నుంచి 25 గ్రాముల చొప్పున బంగారాన్ని బ్యాంకుల్లో దాచుకునే సౌకర్యాన్ని కేంద్రం ప్రకటించింది. ఈ విధానంలో బ్యాంకుల్లో బంగారాన్ని దాచుకుంటే వారికి బాండ్లు ఇస్తారు. దీని మీద వచ్చే వడ్డీ ఆదాయానికి పన్ను మినహాయింపు ఇవ్వనున్నారు.
అయితే ఈ విధానం ద్వారా దేశ ప్రజల వద్దనున్న బంగారం పెద్ద ఎత్తున బ్యాంకులకు చేరటంతో ఆర్థిక పరిపుష్టి ఖాయమన్న వాదన వినిపిస్తోంది. బ్యాంకుల్లో డిపాజిట్ చేసే బంగారానికి సంబంధించి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తరఫున బాండ్లు విడుదల చేయనున్నారు. ప్రస్తుతానికి ఎంపిక చేసిన కొన్ని నగరాల్లో మాత్రమే అమలు చేయనున్న ఈ సరికొత్త విధానానికి సంబంధించిన పూర్తి విధాన పరమైన త్వరలో విడుదల చేయనున్నారు. మోదీ బంగారం లాంటి మరో పథకం తో దేశ ఆర్థిక ప్రగతిని మారిపోతే అంతకన్నా ఏం కావాలి.