నేపాల్ నూతన ప్రధానిగా ఖడ్గ ప్రసాద్ శర్మ ఒలి ఎన్నికైన విషయం తెలిసిందే. దీనిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ శర్మకు శుభాకాంక్షలు తెలిపారు. త్వరలో భారత్ కు రావాల్సిందిగా ఆయనను మోదీ ఆహ్వానించారు. కాగా, నేపాల్ కొత్త రాజ్యాంగంపై వివాదం ముదరడంతో సుశీల్ కొయిరాలా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దీంతో ప్రధాని పదవికి నేపాల్ పార్లమెంటులో కొత్తగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో శర్మ 89 ఓట్ల అధిక్యంతో విజయం సాధించి, నేపాల్ కొత్త ప్రధానిగా ఎన్నికైన విషయం తెలిసిందే.
గతంలో ఆయన ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. కొత్త ప్రధానిగా ఎన్నికైన ఆయనకు రాజ్యాంగ మార్పు వివాదం స్వాగతం పలుకుతోంది. అలాగే వివిధ దేశాలతో ఉన్న సరిహద్దు వివాదం కూడా ఆయనకు తలనొప్పిగా మారే అవకాశం కనబడుతోంది. ఇక కొత్తగా ఎన్నికైన ఆయనకు దేశ విదేశాల ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు చెబుతున్నారు.