మోదీ మార్క్ అక్కడ కూడానా?

September 03, 2015 | 03:06 PM | 1 Views
ప్రింట్ కామెంట్
india-pm-modi-in-nehru-museum-niharonline.jpg

మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ తదితర ప్రముఖులకు గుర్తుగా దేశ వ్యాప్తంగా దాదాపు 39 మ్యూజియాలు, స్మృతి కేంద్రాలు ఉన్నాయి. ఇక త్వరలో వాటిలో కూడా ప్రధాని మోదీ ముద్రలు కనిపించనున్నాయి. ఎన్డీయే ప్రభుత్వ విజయాలకు సంబంధించిన గుర్తులతోపాటు ప్రస్తుత కాలానికి సంబంధించిన అంశాలకు చోటుకల్పిస్తూ ఈ సంస్థలను పునర్వ్యవస్థీకరించనున్నట్లు కేంద్ర సాంస్కృతికశాఖ మంత్రి మహేశ్‌శర్మ తెలిపారు. ఇందులో భాగంగా మోదీకి సంబంధించిన గుర్తులను కూడా ప్రదర్శనలో చేరుస్తారట.

గాంధీ స్మృతి, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ తదితర కేంద్రాలను సమకాలీన అంశాలతో పునర్నిర్మాణం చేస్తామని బుధవారం ఆయన వెల్లడించారు. ఆయా కేంద్రాలను ఏర్పాటుచేసిన స్ఫూర్తిని కొనసాగిస్తూనే వాటిలో ఆధునిక భారతదేశానికి సంబంధించిన చిహ్నాలను ఏర్పాటుచేస్తాం అని వెల్లడించారు. ఈ ప్రకటన కాంగ్రెస్ పార్టీ భగ్గుమన్నది. మోదీ ప్రభుత్వానికి పాపిష్టి చర్య అని కాంగ్రెస్ నేత రణ్‌దీప్‌సుర్జేవాలా విమర్శించారు. భారత స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన గొప్ప వారసత్వం, స్ఫూర్తి, వ్యక్తిత్వాలను ఆరెస్సెస్, బీజేపీలు భూస్థాపితం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ