పని చెయ్యాలంటే అది ఉండాల్సిందేగా

October 05, 2015 | 12:28 PM | 2 Views
ప్రింట్ కామెంట్
modi-open-gyms-in-every-department-niharonline

ఒక్కొ విభాగాన్ని ప్రక్షాళన చేస్తూ వస్తున్న దేశ ప్రధాని మోదీకి మరో బాధ్యత తీసుకున్నారు. ఎప్పుడూ కుర్చీల్లో కూర్చోని టపీ టపీమని కంప్యూటర్ లు కొడుతూ మెషీన్ లా మాదిరిగా మారిపోతున్నారు నేటి తరం ఉద్యోగులు. ఇక మరికొందరు బద్ధక రత్నలైతే సహచర ఎంప్లాయిస్ తో బాతాకాని కొడుతూ ఎంజాయ్ చేస్తూ వారు పనిచెయ్యక, పక్క వారిని చెయ్యనీయకుండా టైంపాస్ చేస్తుంటారు. ఇక ఇప్పుడు వీరి మబ్బును వదిలించే బాధ్యతలను నెత్తిన వేసుకుంటున్నారు ఆయన.  సాహసోపేతమైన క్రీడలకు సిద్ధం కండి అని ప్రస్తుత ఓ నినాదం ఇస్తున్నారు.

అంటే ఎలాంటి ఆటలనుకుంటున్నారా? కొండలెక్కడం, ట్రెక్కింగ్, పారా గ్లైడింగ్, రాఫ్టింగ్ వగైరా. బద్ధకం తొలగిపోయి కూర్చని పనిచెయ్యాలన్న ధోరణి నుంచి బయటపడలాన్నదే ఆయన లక్ష్యం. తద్వారా చిక్కు సమస్యలను అలవోకగా పరిష్కరించే చురుకుదనం దండిగా సమకూరుతుందట. అలాగే ఆరోగ్యవంతులైన ఉద్యోగులే, ఆనందంగా ఉండే ఉద్యోగులే అన్న నినాదంతో ప్రతి కేంద్ర కార్యాలయంలో ఒక వ్యాయామ శాల నెలకొల్పుతారట. మొత్తంగా యావన్మంది ఉద్యోగులు ఫిజికల్ ఫిట్ నెస్ తో చలాకీగా ఉండేట్లు చెయ్యటమే మోదీ లక్ష్యంగా కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించిన ఆదేశాలు అంది కూడా మూడు రోజుల క్రితం పీఎంవో కార్యలయం నుంచి వెళ్లాయట. అధికారికంగా అమలవ్వటమే తరువాయి. ఇందుకు సంబంధించి చిన్నస్థాయి జిమ్ములకు 5లక్షలు, పెద్ద సైజు ఫిట్ నెస్ సెంటర్ల కోసం 10 లక్షలు కేటాయించినట్లు తెలుస్తోంది. మరి ఫిట్ నెస్ ఉంటేనేగా బద్ధకం వదిలిపోయేది పనిచేసేది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ