కలాం జయంతికి మోదీ నివాళులు

October 15, 2015 | 01:09 PM | 2 Views
ప్రింట్ కామెంట్
pm-modi-pays-floral-tribute-to-dr-apj-abdul-kalam-niharonline

మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 84వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళులు అర్పించారు. ఢిల్లీలోని డీఆర్ డీవో లో గురువారం ఉదయం కలాం విగ్రహాన్ని అవిష్కరించిన అనంతరం మోదీ ప్రసంగించారు. కలాం ముందు ప్రజల మనిషి ఆ తర్వాతే దేశానికి రాష్ట్రపతి అని కొనియాడారు. ఇక తమిళనాడులోని రామేశ్వరంలో కలాం స్మారకాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. ఇందుకోసం ఇప్పటికే రామేశ్వరంలో స్థలం కూడా సేకరించామని మోదీ ఇదే వేదికగా ప్రకటించారు. ఇక అక్కడి భవన్ లో కలాం జీవితచరిత్ర మీద ఏర్పాటుచేసిన ఫోటో గ్యాలరీ ఎంతగానో ఆకట్టుకుంది.

మోదీకి కలాం అంటే ఎంత గౌరవమో ప్ర్యతేకంగా చెప్పనక్కర్లేదు. ఆయనను గురువుగా చెప్పుకునే మోదీ కలాం అంత్యక్రియలకు హాజరయ్యేందుకు తన కేబినెట్ లోని ముఖ్యులతో కలిసి రామేశ్వరం తరలిన విషయం గుర్తుండే ఉంటుంది. కలాం చివరి కోరిక మేరకు రామేశ్వరంలో అంత్యక్రియలు జరిపిన కేంద్రం, అక్కడే కలాం స్మారకం ఏర్పాటుకు గతంలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడా హామీని మోదీ దగ్గరుండి నెరవేరుస్తున్నారు. ఇక కలాం ఎక్కువ రోజులు పనిచేసిన హైదరాబాద్ లోని డీఆర్ డీవో సెంటర్ కు కలాం పేరు పెట్టేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ