చేదు జ్ఞాపకానికి 70 ఏళ్లు... ట్వీట్ చేసిన ప్రధాని

August 06, 2015 | 10:40 AM | 3 Views
ప్రింట్ కామెంట్
modi_on_hiroshima_70_years_niharonline

హిరోషిమా.. ఓ చేదు జ్ఞాపకం. తప్పదు, గుర్తుంచుకోవాల్సిందే. మానవాళి మనుగడను సవాలు చేసే ఇటువంటి దుస్సంఘటనలను మర్చిపోతే ఎలా? ఎన్నో ప్రాణాలను మసి చేసిన దారుణాన్ని కాలమైనా మాన్పలేదు. మరోసారి మళ్లీ, ఎక్కడా ఇలాంటి ఉదంతాలు కానరాకూడదు. అలాంటి ఘటనపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా గుర్తుచేసుకున్నారు. నేటికి సరిగ్గా 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ తన ట్విట్టర్లో స్పందించారు. ఆ రోజు జరిపిన బాంబుదాడి, యుద్ధాల వల్ల సంభవించే భయంకరమైన దృశ్యాలను గుర్తుకు తెస్తుందన్నారు. దాడుల వల్ల మానవత్వం మీద పడే ప్రభావం ఆ బాంబుదాడితో అర్థం అవుతుందని ట్విట్టర్ ద్వారా తెలిపారు.  

ఆగస్టు 6, 1945 న జపాన్ లోని హిరోషిమా నగరం పై అమెరికా వైమానిక దళం వేసిన యూరేనియం బాంబు అప్పుడు జరుగుతున్న రెండవ ప్రపంచ యుద్దం ముగింపుకు దారి తీసింది. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో అణ్వాయుధాల పోటీకి తెరతీసింది. హిరోషిమా పై జరిగిన దాడిలో దాదాపు 1,40,000 మంది దుర్మరణం పాలయ్యారు. లక్షాలాదిమంది క్షతగాత్రులయ్యారు. మరో మూడు రోజులకు నాగాసాకి నగరంపై మరో అణుబాంబు దాడి జరిగింది. అక్కడ కూడా ఆదే స్థాయి విధ్వంసం చేలరేగింది.  

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ