మహాజర్నీ: 30 రోజులు 60,000 కిలోమీటర్లు

October 16, 2015 | 02:19 PM | 1 Views
ప్రింట్ కామెంట్
modi_30_days_60000_km_tour_UK_paris_niharonline

లండన్ నుంచి కౌలాలంపూర్, ఆపై పారిస్ నుంచి మాస్కో దాకా ఇలా వరుస పర్యటనతో గిన్నిస్ రికార్డు బద్ధలు కొడదామని ప్రయత్నిస్తున్నారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ఏ ప్రధానికి సాధ్యం కానీ ఇప్పటిదాకా ఎన్నో దేశాలు పర్యటించినప్పటికీ ఎప్పుడు లేని స్పెషాలిటీ రాబోయే వాటికి కలిగింది. రెండు నెలలపాటు భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన కొనసాగనుందట. నవంబర్, డిసెంబర్ నెలలో మోదీ బిజీ షెడ్యూల్ ను పక్కాగా విడుదల చేస్తుంది విదేశాంగ మంత్రిత్వ శాఖ. ఆయా దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాల్లో భాగంగా ఈ పర్యటనలు ఉండబోతున్నాయని సమాచారం. మేకింగ్ ఇండియా లో భాగంగా సహకారం అందించటంతోపాటు, న్యూక్లియర్ ఒప్పందాల దిశగా మోదీ పర్యటనలు ఉండబోతున్నాయని విదేశాంగ శాఖ పర్యటించింది. ఇక రష్యా తో కీలక ఒప్పందాల కోసం ప్రధాని పర్యటనకంటే ముందుగా విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వచ్చే వారంలో అక్కడికి వెళ్లనున్నారు.  

అన్నట్లు ఆయన పదవి చేపట్టిన తక్కువ కాలంలోనే 27 దేశాలు పర్యటించారు. వాట్లో రెండేసిసార్లు పర్యటించినవి కూడా ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజా షెడ్యూల్ ప్రకారం కేవలం నెలరోజుల్లో 60,000 కిలోమీటర్లు ప్రయాణించటం ద్వారా ఏ ప్రధాని నెలకొల్పని రికార్డును మోదీ తన ఖాతాలో వేసుకోనున్నారు. బీహార్ ఎన్నికలు ముగిసిన వెంటనే మోదీ పర్యటనలు ప్రారంభమౌతాయి. ముందుగా యూకే పర్యటనతో ఆయన టూర్ మొదలౌతుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ