క్యాండీ క్రష్ పై తాడో పేడో తేల్చండి!

September 15, 2015 | 05:39 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Narendra-Modi-tweets-candy-crush-facebook-chief-mark-zukerburg-niharonline

అధికారంలోకి రాకముందు, వచ్చాక కూడా సోషల్ మీడియాను వాడుకోవటంలో భారత ప్రధాని నరేంద్ర మోదీని మించిన వారెవ్వరూ లేరనే చెప్పాలి. ఎంతగా వాడలో అంత వాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఫేస్ బుక్ లో అయితే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఫాలోవర్స్ ఉన్న పోలిటికల్ నేత మోదీయే కావటం విశేషం. ఇక మోదీ అమెరికా పర్యటనలో భాగంగా ఫేస్ బుక్ ప్రధాన కార్యాలయంకు వెళ్లనున్నాడు. అక్కడ వ్యవస్థాపకుడు మార్క్ జుకెన్ బర్గ్ తో మోదీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.

ఇది బాగానే అంతా బాగానే ఉంది.. కానీ మోదీ, ఫేస్ బుక్ మధ్యలో క్యాండీక్రష్ వచ్చి చేరింది. ఎందుకలా అనుకుంటున్నారా? అక్కడికే వద్దాం...

గేమ్ లందు క్యాండీ క్రష్ వేరయ్యా... ఇది చాలా క్రేజీ గేమ్. స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు క్యాండీక్రష్  గేమ్ తో టైంపాస్ చేస్తుంటారు. ఆడితే ఆడారు గానీ గేమ్ లాస్ అయిన వారు మరో స్టేజ్ కు, లైఫ్ కోసం సోషల్ మీడియా ముఖ్యంగా ఫేస్ బుక్ లో నోటిఫికేషన్ లు పంపిస్తుంటారు. ఇది సాధారణంగానే ఫేస్ బుక్ లవర్స్ కు చిరకు తెప్పిస్తోంది. అందుకే ఎలాగూ ఇప్పుడు మోదీ గారు జుకర్ బర్గ్ ను కలుస్తున్నారు కదా. బాబ్బాబు... కాస్త, క్యాండీ క్రష్ ల నోటిఫికేషన్లపై కంప్లైంట్ చెయ్యండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారట. ఫేస్ బుక్ తోపాటు మరో సోషల్ మీడియా ట్విట్టర్లో మోదీకి వరుస బెట్టి ట్వీట్లు చేస్తున్నారట. మరి మోదీ మనవాళ్ల మోర ఆలకిస్తారా? కంప్లైంట్ చేస్తారా? చూద్దాం...

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ