ఈసారి మోదీ మీట్ వారితోనే...

September 16, 2015 | 02:42 PM | 1 Views
ప్రింట్ కామెంట్
Modi-meet-varanasi-rickshaw-puller.jpg

చాయ్ వాలాగా కెరీర్ ను ప్రారంభించిన మోదీ ప్రధాని స్థాయికి ఎదిగారు. కష్టాల విలువ తెలుసు కాబట్టే ఆ స్థాయికి, హోదా అనుభవిస్తున్నా  డౌన్ టూ ఎర్త్ ఉండటం అనేది మాములు విషయం కాదు. సాధారణ వ్యక్తిగా తన తోటివారితో మమేకమై మాట్లాడటం ఆయన సొంతం. ఆ మధ్య చాయ్ వాలాతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ఇఫ్పుడు మరో వర్గం ప్రజలపై దృష్టిసారించారు.

ఈ నెల 18న ఆయన తన సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడి రిక్షావాలాలు, తోపుడు బండ్లు లాక్కునే పేదవారితో సమావేశం కానున్నారు. స్వయంగా వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారట. పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం జన్ ధన్ పథకం కింద 501 రిక్షాలు, 101 ఈ రిక్షాలను లబ్ధిదారులకు పంపిణీ చెయ్యనున్నారట. తాను అలాంటి కష్టాల నుంచే వచ్చానని, వారి విలువ ఏంటో తనకు బాగా తెలుసునని మోదీ పర్యటన గురించి చర్చించిన అధికారుల వద్ద ప్రస్తావించినట్లు సమాచారం.   

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ