దుబాయ్ లో హల్ చల్ చేస్తున్న నమో

August 17, 2015 | 03:07 PM | 2 Views
ప్రింట్ కామెంట్
narendra_modi_second_day_in_dubai_niharonline

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూఏఈలో పర్యటన రెండవరోజు సోమవారం కొనసాగుతోంది. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ యూఏఈలో పర్యటన రెండవరోజు సోమవారం కొనసాగుతోంది. అబుధాబిలోని మస్టర్‌ నగరంలో గల సౌరవిద్యుత్‌ కార్ల సంస్థను పరిశీలించారు. ప్లాంట్‌లో కార్ల తయారీ విధానాన్ని ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే యూఏఈ రాజు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జయాద్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

                           ఈ సందర్భంగా ఆ దేశంతో పలు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. ఈరోజు దుబాయ్ అంతర్జాతీయ మైదానంలో జరిగే ఈ సభలో దాదాపు 50 వేల మంది ప్రవాస భారతీయులనుద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. అంతకు ముందు మీడియాతో ఆయన మాట్లాడుతూ... ఉగ్రవాదానికి ఎంత మాత్రం తావు ఉండరాదని, ఈ దిశగా భారత్, యూఏఈ చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. అంతకుముందు అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. భారత్‌లో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని పేర్కొన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా ప్రపంచ సంస్థలే గుర్తించాయని తెలిపారు. తన పర్యటనలో భాగంగా మోదీ ఆదివారం రాత్రి ప్రఖ్యాత షేక్ జాయేద్ మసీదును సందర్శించారు. అక్కడ పర్యటకులతో కలిసి మోదీ సెల్ఫీలు దిగారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ