గ్రాండ్ వెల్ కం ఒలంపిక్స్ స్టైల్లోనా?

August 29, 2015 | 03:11 PM | 1 Views
ప్రింట్ కామెంట్
grand_welcome_planned_for_modi_UK_visit_niharonline.jpg

వరుస విదేశీ పర్యటనల్లో ఉన్న మోదీ కి ఆయా దేశాల నుంచి వచ్చిన స్పందనను మనం చూశాం. విమర్శల సంగతి పక్కన బెట్టి ప్రతీ పర్యటనకు ఆయన పేరు, ప్రతిష్టలు మరింత పెరుతూనే వస్తున్నాయి. ఇక ఇప్పడు తమ దేశ చరిత్రలో ఏ నేతకు కూడా ఇవ్వనంత ఘనమైన స్వాగతాన్ని మన దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఇచ్చేందుకు యూకే సిద్ధమైపోతుంది. నవంబర్ రెండో వారంలో మోదీ బ్రిటన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వాంబ్లే స్టేడియంలో ఘన స్వాగతం పలకాలని ఆ దేశం నిర్ణయించింది. అంతేకాదు దీనికోసం ఒలంపిక్స్ ఆరంభ వేడుకలు ఎలా నిర్వహిస్తారో అంత ఘనంగా చేస్తారట. అనంతరం సుమారు 70 వేల మందిని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారట. మోదీ విదేశాల్లో అత్యధికులను ఉద్ధేశించి ప్రసంగించే కార్యక్రమం ఇదే కానుంది. టూ గ్రేట్ నేషన్స్... వన్ గ్లోరియస్ ప్యూచర్ అనే థీమ్ తో ఈ వేడుకలను నిర్వహించనున్నట్లు యూరప్ ఇండియా ఫోరమ్ ప్రకటించింది. వేడుకలకు బ్రిటన్ ఎంపీలు, వ్యాపారవేత్తలు పాల్గొననున్నట్లు సమాచారం. పాస్ ల కోసం ukwelcomesmodi.org పేరిట ఓ ప్రత్యేక వెబ్ సైట్ ను కూడా ప్రారంభించారు. మొత్తానికి బ్రిటన్ మోదీకి మరిచిపోలేని గౌరవం ఇవ్వబోతుందని అర్థమౌతోంది. అదే సమయంలో మన దేశంలో దీపావళి ఉంది. సో... మోదీ రాక సందర్భంగా బ్రిటన్ లో కూడా బాణాసంచాల పేలుళ్లతో బ్రిటన్ లో కూడా పండగ వాతావరణం నెలకొనుందన్న మాట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ