దేన్నీ వదిలె సమస్యే లేదు... అన్నింటిపైనా చర్చిద్దాం

July 20, 2015 | 01:05 PM | 2 Views
ప్రింట్ కామెంట్
PM_narendra_modi_all_party_meeting_niharonline

భూసేకరణ వంటి కీలకమైన బిల్లుల విషయంలో వెనక్కితగ్గే ప్రసక్తే లేదని దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. పార్లమెంటు సమావేశాలకు ముందు సోమవారం ఉదయం అఖిలపక్ష భేటీ నిర్వహించగా ఆయన మాట్లాడారు. ప్రతి బిల్లుపైనా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అన్ని అంశాలనూ చర్చించేందుకు పార్లమెంట్ వేదికను వినియోగించుకోవాలని, దయచేసి సభా సమయాన్ని వృథా చేయవద్దని ఆయన కోరారు. విపక్షాల ఒత్తిడికి తలొగ్గి వెనుకంజ వేయబోమని ఆయన ప్రకటించారు. కాగా, ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాలు వాడివేడిగా సాగుతాయని రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన పలు అంశాలు, భారీ కుంభకోణాలపై ప్రభుత్వాన్ని కడిగి పారేయాలని విపక్షాలు సిద్ధమవుతున్నాయి. మహారాష్ట్ర లో పంకజ్ ముండే అంగన్ వాడీ నిధుల కుంభకోణం, మధ్యప్రదేశ్ లో వ్యాపం, లలిత్ గేట్, ఇరానీ విద్యార్హతల తదితర అంశాలపై బీజేపీ సర్కార్ ను ఇరుకున పెట్టేందుకు అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. మరోపక్క వాటన్నింటికీ దీటుగా సమాధానమిచ్చేందుకు బీజేపీ సభ్యులు సైతం సిద్ధంగా ఉన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ