మధ్యప్రదేశ్‌లో ఒకే ప్రదేశంలో రెండు రైళ్లు పట్టాలు తప్పడం బాధాకరమని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఈ దుర్ఘటన బాధాకరం కలిగించిందన్నారు. రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు మోదీ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వం తరపున క్షతగాత్రులకు ఎలాంటి సాయం అయినా అందించేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. మచక్ నది పొంగి పొర్లుతుండగా ట్రాక్ కొట్టుకుపోవటంతో ఈ ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. కామయాని, జనతా ఎక్స్ ప్రెస్ రైళ్లకు చెందిన మొత్తం 15 బోగీలు నదిలో మునిగాయి. అయితే స్థానికులు మాత్రం 16 బోగీలు నీట మునిగినట్లు చెబుతున్నారు. కాగా, ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 31 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారికి రూ. 2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేలు రైల్వే శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే.