ఆ 40 మంది దేశద్రోహానికి పాల్పడుతున్నారు

September 11, 2015 | 02:53 PM | 3 Views
ప్రింట్ కామెంట్
narendra-modi-chandigarh-rally-fire-on-congress-niharonline

దేశద్రోహానికి పాల్పడే వారు ఎవరైనా వదిలే ప్రసక్తే లేదని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. శుక్రవారం చండీగఢ్ పర్యటనలో ఉన్న ఆయన బహిరంగ సభలో ఆవేశపూరితంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 400 మంది ఎంపీలు దేశ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తుంటే, 40 మంది కుట్ర చేస్తున్నారంటూ విమర్శించారు. సభ కార్యాకలాపాలకు అడ్డుపడుతూ... ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఇక్కడ గొంతు నొక్కితే నేరుగా ప్రజల్లోకే వెళ్తామన్నారు. పార్లమెంట్ లో వారు వ్యవహారించే తీరుచూస్తే ప్రజలు వారిని క్షమించరని, తగిన సమయంలో బుద్ధిచెబుతారని మోదీ పేర్కొన్నారు. అహంకారంతో ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. మాజీ సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చేసిన ఘనత తమదేనని పేర్కొన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ