ప్రధాని పర్యటనతో కాసుల వర్షం ఖాయమట

October 01, 2015 | 03:52 PM | 1 Views
ప్రింట్ కామెంట్
raghuram-rajan-about-modi-US-tour-niharonline

దేశ ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల వల్ల భారత్‌కు ఏం లాభం చేకూరింది ప్రతిపక్షాలతోపాటు సాధారణ ప్రజానీకం మదిలో మెదులుతున్న ప్రశ్నలివే. ఎన్నారైల పెట్టుబడులతోపాటు, అగ్ర కంపెనీల పెట్టుబడులతో కాసుల వర్షం కురవటం ఖాయమని చర్చలు జరిగాయి. అయితే దానిపై మాట్లాడాల్సిన వారు నోరు మెదిపితేనే అసలు విషయం బయటపడుతుందని ప్రతిపక్షాలు ఎద్దేవా చేశాయి. ఆయన ఎవరో కాదు రిజర్వు బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్. విమర్శలు వెల్లువలా రావటంతో ఆయన ఇప్పుడు కదిలారు.

మోదీ పర్యటనపై ఓ క్లారిటీ ఇస్తూ మీడియా ముందుకు వచ్చారు. భారత్ తరపున మోదీ విదేశీ పర్యటనల వల్ల నేలచూపు చూస్తున్న అన్ని రంగాలు వృద్ధి బాట పట్టనున్నాయని, ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారుల నమ్మకం కాస్త మెరుగుపడనుందని ఓ ప్రైవేట్ చానెల్ కిఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి వల్లనే పాలసీలో వడ్డీరేట్లు తగ్గించినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. భారత్ ఆర్థిక రంగం మెరుగైన వృద్ధి సాధించాలంటే విదేశీ పెట్టుబడులు ఖచ్చితంగా అవసరమవుతాయని, ప్రధాని కూడా ఇదే బాటలో ప్రయాణించడం మంచి పరిణామమని, దేశీయంగా సులభంగా వ్యాపారం చేయడానికి అనుకూల పరిస్థితులు కల్పించేందుకు ఆయన కృషి చేస్తున్నట్లు రాజన్ చెప్పారు. ముఖ్యంగా చైనా ఆర్థిక రంగం మందకొడిగా ఉన్న నేపథ్యంలో పెట్టుబడులను ఆకట్టుకోవడంలో  మోదీ పర్యటన చాలా ఫ్లస్ అదనపు ఆకర్షణ అని ఆయన అభిప్రాయపడ్డారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ