అక్కడ ఇక్కడ తేడా లేదు.. ఎక్కడైనా తోపే

August 18, 2015 | 10:52 AM | 1 Views
ప్రింట్ కామెంట్
pm_narendra_modi_linkedin_most_viewed_ceo_niharonline

సాంకేతిక మాధ్యమాలను వాడుకోవటంలో ప్రధాని మోదీ ఎంత దిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సార్వత్రిక ఎన్నికల సమయానికి కంటే ముందు నుంచే సోషల్ మీడియాల్లో ఆయన చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఫేస్ బుక్.. ట్విట్టర్, ఇన్ స్టాగ్రమ్ ఆఖరికి చైనా ట్విట్టర్ ను కూడా వదలకుండా అన్నింట్లో దున్నిపాడేస్తున్నాడు. ఒకరకంగా చెప్పాలంటే ఆయన అధికారంలోకి రావటానికి పరోక్షంగా దోహదపడిందీ  ఈ సోషల్ మీడియానే. అంతేకాదు ప్రపంచంలో అత్యధిక మంది అనుసరిస్తున్న మూడో ప్రపంచ నేతగా ఇప్పటికే రికార్డు సృష్టించాడు మోదీ. మరోవైపు అతిపెద్ద నెట్ వర్క్ ఫేస్ బుక్ లో దాదాపు  3కోట్లకు పైగా లైకులతో ఆయన దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో మాధ్యమంలో ఆయన గుట్టు చప్పుడు కాకుండా దూసుకుపోతున్నారు.

                                     పేరుకు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ అయినప్పటికీ... చాలా పరిమితమైన వర్గం మాత్రమే వినియోగించేది లింక్డిన్. దీంట్లో కూడా మోదీ క్రేజ్ అంతకంతకూ పెరిగిపోతోంది. లింక్డిన్ సెర్చ్  జాబితాలో ఇప్పుడు మోదీ అగ్రస్థానంలో నిలిచారు. అత్యధికంగా పది లక్షల మంది ప్రధాని మోదీని అనుసరిస్తున్నారట. లింక్డిన్ లో అత్యధికంగా చూసే సీఈవోల జాబితాలో ఆయన అగ్రస్థానంలో కొనసాగటం నిజంగా విశేషం. గూగుల్ ఉపాధ్యక్షుడు.. ఎండీ రాజన్ ఆనందన్.. బయోకాన్ సీఈవో కిరణ్ మజుందార్ షా.. స్నాప్ డీల్ సీఈవో కునాల్ బాల్.. ఫేస్ బుక్ ఎండీ కీర్తిగ రెడ్డి.. ఇంటెల్ ఇండియా అధ్యక్షుడు కుముద్ శ్రీనివాసన్ తదితరులు తర్వాతి స్థానంలో ఉన్నారు. మొత్తానికి అది ఇది అని తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ మోదీ తన హవా చాటుతూ దూసుకుపోతున్నారన్నమాట.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ