యువతే ఎక్కువ చనిపోవటం బాధాకరం!

July 27, 2015 | 03:57 PM | 4 Views
ప్రింట్ కామెంట్
modi_road_safety_bill_man_ki_baat_niharonline

రోడ్డు రవాణా, భద్రత బిల్లు త్వరలో ప్రజల ముందకు తీసుకువస్తామని దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రతి నిమిషానికి దేశంలో ఒక ప్రమాదం జరుగుతోంది. ప్రతి నాలుగు నిమిషాలకు ఓ ప్రాణం పోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అడ్డుకట్ట వేయడం ఎలా..? అనే అంశంపై కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్నట్లు మోదీ తెలిపారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా ముందుగా కార్గిల్ అమర వీరులకు నివాళులర్పించిన అనంతరం ఆయన ప్రసంగించారు. రోడ్డు ప్రమాదాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ... గణాంకాలను చూస్తే ఆశ్చర్యం వేయకమానదు. దేశంలో ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు రోడ్డు ప్రమాదంలో మృతిచెందుతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. అందు కోసం తల్లిదండ్రులు వారి పిల్లలకు రోడ్డు భద్రత, నియమనిబంధనలపై అవగాహన కల్పించాలి అని ఆయన కోరారు. రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందిన వారిలో అధికంగా 15-25 ఏళ్ళ వయస్సు కలిగిన యువతే కావడం మరింత బాధాకరమన్నారు. త్వరలో రోడ్డు భద్రత పాలసీని తీసుకొస్తామని, ఎంపిక చేసిన నగరాల్లో, రహదారులపై రోడ్డు ప్రమాదానికి గురైతే ఉచిత వైద్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన రోడ్డు రవాణా భద్రత బిల్లును త్వరలో పార్లమెంటులో ప్రవేశపెడతామని చెప్పారు.  దీనదయాళ్‌ ఉపాధ్యాయ్‌ గ్రామ జ్యోతి యోజ న కింద ప్రతి గ్రామానికి 24 గంటల పాటు విద్యుత్తు సరఫరా చేస్తామని తెలిపారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ