బోస్ వారసులతో భేటీ ఎందుకబ్బా?

September 21, 2015 | 12:21 PM | 1 Views
ప్రింట్ కామెంట్
PM-narendra-modi-to-meet-bode-family-members-niharonline

స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం మిస్టరీపై బెంగాల్ ప్రభుత్వం ఫైళ్లను విడుదల చేసింది. ఇక ఈ విషయంలో తుదిగా తేల్చాల్సింది కేంద్రమేనని మంత్రులే స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆయను కుటుంబ సభ్యులను కలవాలనుకోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

               చంద్రబోస్ కుటుంబీకులతో వచ్చే నెలలో సమావేశం ఉంటుందని పీఎంవో వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ సమావేశం ప్రధాని నివాసంలోనే జరగనుందట. ఈ విషయాన్ని స్వయంగా మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలిపారు. గత మేలో నేను కోల్ కతా వెళ్లాను. అప్పుడు సుభాష్ బాబూ (నేతాజీ) కుటుంబసభ్యులను కొందరిని కలిశాను. నేతాజీకి సంబంధించి అందుబాటులో ఉన్న ఆయన వారసులందరినీ కలుసుకోవాలనిపించింది. దీంతో ఓ సమావేశం ఏర్పాటు  చెయ్యాలని భావించాను. సుమారు 50 మందికి పైగా బోస్ వారసులు ఈ సమావేశంలో పాల్గొంటారు’ అని మోదీ తెలిపారు. ఈ భేటీలో బోస్ కుటుంబీకులతోపాటు స్కాలర్లు, తదితరులు కూడా పాల్గొంటారని సమాచారం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ