బీహార్ రాష్ర్టానికి ప్రధాని నరేంద్ర మోదీ భారీ వరాన్ని ప్రకటించారు. మంగళవారం బీహార్‌లో పర్యటించిన ఆయన 1.25 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. ఆర్రాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన దీనిని ప్రకటించారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ... ‘బీహార్ భవిష్యత్తును బీజేపీ ప్రభుత్వం మార్చేస్తుందని ఉద్ఘాటించారు. రూ.60 వేల కోట్లు ఇస్తారా...రూ.70 వేల కోట్లు ఇస్తారా...రూ.90 వేల కోట్లు ఇస్తారా అని అందరూ ఉత్కంఠంగా ఎదురు చేస్తున్నారు. కానీ, రూ.1.25 లక్షల కోట్లు ఇస్తున్నాం. అంతేకాదు మరో రూ.40 వేల కోట్ల గ్రాంట్ కూడా ఇస్తామని చెప్పారు. అవసరమైతే మరిన్ని నిధులిస్తామని మోదీ హామీ ఇచ్చారు. వెంటనే ప్రజలు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు. పేదరికం నుంచి ధనిక రాష్ట్రంగా బీహార్‌ను అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.అనంతరం పలు అభివృద్ధి కార్యాక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. బీహార్ అభివృద్ధి చెందితే ఎక్కువగా ఆనందించేది తానే అని ఆయన అన్నారు. దళితుల అభ్యుదయం కోసి కృషి చేసిన వ్యక్తిని బీహార్ గవర్నర్‌గా నియమించామని మోదీ తెలిపారు. బీహార్ పర్యటనలో మోదీ పలు అభివృద్ధి కార్యాక్రమాలకు శంకుస్థాపన చేశారు. 11 జాతీయ రహదారుల విస్తరణ ప్రాజెక్టులను ప్రారంభించారు. 25 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అలాగే 23 స్కిల్ ట్రైనింగ్ సెంటర్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. బీహార్‌కు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడంతో మోదీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించినట్లు అయ్యింది.
ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, ప్యాకేజీ పై తీవ్ర కాలయాపన చేస్తున్న సమయంలో ఇప్పుడిలా బీహార్‌పై వరాల జల్లు కురిపించటం ఎన్ని విమర్శలకు దారితీస్తుందో లెట్ వెయిట్ అండ్ సీ...