జమ్ముకశ్మీర్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరాల జల్లు కురిపించారు. శుక్రవారం జమ్ములో పర్యటించిన మోదీ ఐదేళ్లలో రాష్ర్టానికి రూ.లక్ష కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ ఉదయం జమ్మూ చేరుకున్న మోదీ అక్కడి విశ్వవిద్యాలయంలో జరుగుతున్న శ్రీ గిరిధారి లాల్ డోగ్రా జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. మరోవైపు సరిహద్దులో పాక్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతుండటంతో ఏర్పడిన ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని పర్యటనలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాని ప్రయాణించే మార్గంలో మల్టిపుల్ క్విక్ రెస్పాన్స్ బృందాలను ఏర్పాటు చేశారు. ప్రధానితో పాటు కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ, కశ్మీర్ ముఖ్యమంత్రి ముఫ్తిమహ్మద్ సయీద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.