ప్రధాని నిర్ణయం ఆశ్చర్యం కలిగించేదే, కానీ...

October 08, 2015 | 12:46 PM | 2 Views
ప్రింట్ కామెంట్
modi-decision-on-airforce-makeinindia-opposed-decision-niharonline

అంశం ఎంత క్లిష్టమైంది అయినప్పటికీ నిర్ణయాలు తీసుకోవటంలో ప్రధానిది ఎప్పుడూ ధైర్యం చేస్తుంటారు. ప్రయోగాత్మకమైనప్పటికీ అవి ఖచ్ఛితంగా విజయవంతమై తీరుతాయి. అయితే కీలకమైన రక్షణ రంగానికి సంబంధించిన అంశం కావటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అవుతుంది. పక్షాల నుంచి విమర్శలు వెలువెత్తుతున్నా... పార్టీలో సీనియర్లు వ్యతిరేకిస్తున్నా మోదీ ఎందుకంత డేర్ చేస్తున్నారు. అసలు అదేంటి?

రక్షణ రంగానికి సంబంధించి వాయుసేన అత్యాధునిక విమానాల కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఆ నిర్ణయాన్ని ప్రస్తుతం ప్రధాని తీవ్రంగా వ్యతిరేకించటంతోపాటు వద్దని సూటిగా చెప్పేశారట. కాలం చెల్లిన మిగ్ తరహా యుద్ధ విమానాల స్థానంలో అత్యాధునిక విమానాలను అందించాలని భారత వాయుసేన చేస్తున్న ప్రతిపాదనలకు మోదీ సర్కారు వ్యతిరేకించారట.

డిమాండు మేరకు 36 యుద్ధ విమానాలను 'దస్సాల్ట్ ఏవియేషన్' నుంచి కొనుగోలు చేయాలని మిలిటరీ కోరగా, అందుకు నిరాకరించిన కేంద్రం, దేశంలో తయారైన 'తేజస్' విమానాలతో సర్దుకోవాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. మేకిన్ ఇండియా విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఇకపై విదేశీ యుద్ధ విమానాల కొనుగోలు వద్దని నిర్ణయించుకున్నట్టు సమాచారం. మేకిన్ ఇండియా విధానం బాగున్నప్పటికీ, తేజస్ విమానాల తయారీ మాత్రం దాదాపు 3 దశాబ్దాలుగా సాగుతోంది. ఇప్పటికీ వాటి భద్రత, పనితీరుపై నెలకొన్న అనుమానాలు తొలగలేదు. అనుకోని పరిస్థితుల్లో అటు పాకిస్థాన్, ఇటు చైనాలతో పోరాడాల్సి వస్తే, భారత వాయుసేనకు 45 ఫైటర్ స్క్వాడ్రన్స్ అవసరం ఉండగా, ఇప్పుడు కేవలం 35 మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటిగా మూలన పడుతుండటంతో 2022 నాటికి 15 మాత్రమే మిగిలే పరిస్థితి నెలకొంది. ఈలోగా లోటును పూడ్చే చర్యలు తీసుకుంటే చాలని, అవి దేశవాళీ విమానాలైనా, విదేశీ విమానాలైనా తమకు ఒకటేనని వాయుసేన చెబుతోంది. అదే టైంలో భద్రతా, సేఫ్టీ పరంగా  మోదీ నిర్ణయంతో రక్షణ రంగంలో కొత్త టెన్షన్ పట్టుకుంది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ