ములాయంను మెచ్చుకున్న మోదీ

August 11, 2015 | 01:15 PM | 1 Views
ప్రింట్ కామెంట్
PM_Narendra_Modi_praised_Mulayam_Singh_Yadav_niharonline

దేశ ప్రధాని మోదీ చరిష్మాను తగ్గించేందుకు జనతా పరివార్ అనే పార్టీని తిరిగి స్థాపించేందుకు ఆద్యుడు ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్. మోదీ హవాను పూర్తిగా మసకబార్చేందుకు చేసే ప్రయత్నాల్లో ఆయన ఎప్పుడు ముందుంటాడు అని టాక్. మరి అలాంటి వ్యక్తిని మోదీ పొగడమేంటని ఆశ్చర్యంగా ఉందికదూ. అవును నిజంగానే ఆయన ములాయం ను ప్రశంసించారు.

పార్లమెంటులో ప్రతిరోజు ప్లకార్డులతో ఆందోళన చేస్తూ కాంగ్రెస్ కార్యకలాపాలను అడ్డుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో మండిపోయిన ములాయం కాంగ్రెస్ ను తీవ్రంగా హెచ్చరించారట. అనవసరమైన రాద్ధాంతం చేసి సభా గౌరవాన్ని పాడుచెయ్యోద్దని ఫైర్ అయ్యారట. విషయం తెలిసిన మోదీ పార్టీ పార్లమెంటు బోర్డు సమావేశంలో ములాయం విషయాన్ని ప్రస్తావనకు తెచ్చారట. పార్లమెంటును తప్పుదారి పట్టించి కొంత మంది దేశ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మోదీ పేర్కొన్నారట. అయితే సభలో జరిగే ఆందోళణ తగ్గించి, సజావుగా సాగించేందుకు ములాయం పరోక్షంగా మంచి పని చేశారని ప్రధాని సహచరులతో అన్నట్లు సమాచారం.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ