నవ్యాంధ్ర రాజధాని అమరావతి శంకుస్థాపన ముహుర్తానికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ హజరవుతారా అన్నది చాలా మందికి అనుమానంగా ఉండేది. నిధుల విడుదలలో జాప్యం, మరోవైపు ప్రత్యేకంపై ప్రకటన లేకపోవటంతో తెలుగు ప్రజలకు ప్రదాని మొహం చాటేస్తారని అంతా అనుకున్నారు. మీడియా కూడా ఈ విషయమై చాలా ఆర్భాటాలు, వార్తలు రాసిపడేసింది. మోదీ ఆరోజు అవసరమనుకుంటే వేరే కార్యక్రమాన్ని ఫిక్స్ చేసుకుని మరీ హాజరవుతారని పుకార్లు రేపింది. అయితే దాన్ని పటాపంచల్ చేస్తూ మోదీ హాజరవుతున్నట్లు పీఎంవో కార్యాలయం ప్రకటించింది. అంతేకాదు ఏపీ అధికారులు కూడా ఆయన షెడ్యూల్ వివరాలను విడుదల చేశారు కూడా. 22 న ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుంటారు.
ఉదయం 11.45 నిమిషాలకు గన్నవరం చేరుకున్న ఆయనకు పలువురు మంత్రులు అధికారులు స్వాగతం పలుకుతారు.
అక్కడి నుంచి అమరావతికి చేరుకున్న తర్వాత 12.35 కి రాజధాని నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు.
అక్కడే రెండు గంటపాటు గడిపిన అనంతరం 2.45 కి తిరుపతికి చేరుకుంటారు.
4.05 కి రేణిగుంట విమానాశ్రయానికి, అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు చేరుకుంటారు.
సాయంత్రం 5.25 కి స్వామివారిని దర్శించుకుని రెండు గంటలు దైవసన్నిధిలోనే గడుపుతారు.
ఇక తిరిగి రాత్రి 7.30 కి ప్రధాని ఢిల్లీ తిరుగు ప్రయాణం అవుతారు.