నాగా శాంతి ఒప్పందం చారిత్రకం

August 04, 2015 | 01:06 PM | 3 Views
ప్రింట్ కామెంట్
narendra_Modi_on_nagaland_peace_treaty_niharonline

ప్రధానమంత్రి మోదీ చొరవతో 'నాగా'తో కేంద్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. నాగా తిరుగుబాటుదారులైన నేషనలిస్ట్‌ సోషలిస్ట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ నాగాల్యాండ్‌ (ఇసాక్‌ -, మ్యువా) నేతలతో శాంతి ఒప్పందంపై ప్రభుత్వం సోమవారం సంతకం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, ఇతర ప్రభుత్వాధికారులు,  ఎన్‌ఎస్‌సిఎన్‌(ఐ-ఎం) నాయకుడు థుయింగలెంగ్‌, ఇతర నాయకులు సంయుక్తంగా ప్రకటన చేశారు. దీనిపై మాట్లాడుతూ ఈ చిరస్మరణీయ సందర్భానికి భగవంతునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ముయివా అన్నారు. మహాత్మా గాంధీపై నాగా లాండ్‌ ప్రజలకు అమితమైన గౌరవం ఉందని, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి రాజనీతిని అభినందిస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి ఆయన కృతజ్ణతలు తెలిపారు.

                              అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ దీనిని చారిత్రక శాంతి ఒప్పందంగా దీన్ని అభివర్ణించారు. నాగాలాండ్‌ రాజకీయ సమస్య ఆరు దశాబ్దాలుగా నలుగుతోందని, అప్పటి నుంచి అనేకమంది దీనికి బలయ్యారని అన్నారు. ఒప్పందం విషయంలో విజ్ఞతను, ధైర్యాన్ని ప్రదర్శించినందుకు ముయివాను ఇసాక్‌ స్యూను ఆయన ప్రశంసించారు. ఆరు దశాబ్దాల నుంచి నాగాలాండ్ లో వేర్పాటువాద గ్రూప్ నాగా వేర్పాటువాద పోరాటం చేస్తూనే ఉంది. దీనికి ఈరోజు స్వస్తి చెపుతూ ఒప్పందం చేసుకుంది. రెండు దశాబ్దాల పాటు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నట్లు తెలిపింది. కాగా ఈ ఒప్పందం 18 నెలల్లో అమలులోకి వస్తుందని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. నాగాతో ఇలాంటి ఒప్పందం చేసుకోవడం ద్వారా గాంధీజీ నడిచిన బాట అయిన అహింసపై ఉన్న విశ్వాసాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పినట్లయిందని అన్నారు. భుజంభుజం కలిపి అభివృద్ధి బాటలో పయనించేందుకు ముందుకు వచ్చి కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన నాగా నేతలకు అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు. గాయాలు మాన్పే, సమస్యలను పరిష్కరించే విషయాల్లోనే కాదు... మీ గౌరవప్రతిష్టలను నిలుపుకునే ప్రయత్నాల్లో కూడా భాగస్వాములవుతాం అని మోదీ ఈ సందర్భంగా వారికి హామీనిచ్చారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ