ప్రధాని దృష్టిలో బెస్ట్ టీచర్ ఎవరంటే?

September 04, 2015 | 11:59 AM | 3 Views
ప్రింట్ కామెంట్
PM-modi-teachersday-speech-kalam-2015-niharonline.jpg

ఓ మనిషికి తల్లి జన్మనిస్తుంది... కానీ, గురువు జీవితాన్ని ప్రసాదిస్తాడని దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రతీ పదవికి రిటైర్డ్ మెంట్ ఉంటుందని, కానీ, గురువు అనే హోదా కి ఎప్పటికీ విరమణ ఉండదని ఆయన అన్నారు. మానెక్‌షా ఆడిటోరియంలో  శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన టీచర్స్ డే కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... విద్యార్థుల వల్లే ఉపాధ్యాయులకు గుర్తింపు వస్తుందని తెలిపారు. విద్యార్థులు ఎక్కువ సమయం గురువులతోనే గడుపుతారని... మన మనసులపై గురువు ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. ఉపాధ్యాయులకు పదవీ విరమణ అన్నదే ఉండబోదని, నా దృష్టిలో ఉత్తమ గురువు అబ్దుల్ కలాం అని చెప్పారు. కలాం ప్రతిక్షణం కొత్త ప్రతిభను అన్వేషించేవారని గుర్తుచేశారు. తనను ఉపాధ్యాయుడిగా గుర్తుంచుకోవాలని అబ్దుల్‌కలాం భావించేవారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అనంతరం మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ స్మరణార్థం నాణెం విడుదల చేశారు.  ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, పలువురు అధికారులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ