ప్రధాని పంద్రాగష్టు ప్రసంగం లీక్

August 07, 2015 | 10:55 AM | 1 Views
ప్రింట్ కామెంట్
narendra_modi_speech_from_redfort_niharonline

ఎంత గోప్యంగా ఉంచుదామన్నా ఇప్పుడున్న టెక్నాలజీ కాలంలో ఎలాంటి విషయాలైన బయటపొక్కుతూనే ఉన్నాయి. తాజాగా హోం మంత్రిత్వ శాఖ ఇందులోంచి మినహాయింపు కాదని చెబుతోంది. దేశ ప్రధానికి ఆగష్టు 15న చేయబోయే ప్రసంగాన్ని హోం మంత్రిత్వ శాఖే లీక్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 15 న న్యూఢిల్లీలో ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఉపన్యాసంలో ఉన్న అంశాలు ఇవే... అమెరికాలో వివిధ సమస్యలు, నేరాల గురించి తెలిపేందుకు వాడే 911 తో పోలిస్తే భారత్ నిర్వహించే నిర్భయ హెల్ప్ లైన్ 112 గొప్పదని మోదీ చెప్పనున్నారట. రోజుకు దాదాపు 3,500 నుంచి 10 లక్షల వరకు కాల్స్ స్వీకరించేలా అధునాతన సాంకేతిక పరిజ్నానంతో ఈ సర్వీస్ నడుస్తుందన్న విషయాన్ని ఆయన గుర్తుచేస్తారట. లక్షకు పైగా పోలీస్ వాహనాల్లో 2017 నాటికల్లా ప్రత్యేక ట్రాకింగ్ ట్యాబ్స్ ను అమరుస్తామని కూడా ఆయన చెప్పనున్నారట. మొత్తానికి అమెరికా ఎమర్జెన్సీ సర్వీస్ కన్నా మన 112 ఏ రేంజ్ లో బెటర్ గా ఉందో మోదీ క్షుణ్ణంగా చెప్పనున్నారని తెలుస్తోంది కాగా, నిర్భయ హెల్ప్ లైన్ కోసం రూ.321 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ టోల్ ఫ్రీ నంబర్ వచ్చే సంవత్సరం నుంచి అందుబాటులోకి రానుంది.   . దీంతోపాటు వివిధ మంత్రిత్వ శాఖల నుంచి వచ్చే సమాధానాలను స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మోదీ ప్రస్తావిస్తారని ఓ లేఖను హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.

తాజా వార్తలు

అత్యంత ప్రజాదరణ